నిన్న జరిగిన మోదీ సభ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ స్పందించారు. మోదీ నిజమైన హీరో అంటూ మోదీ కి కితాబు ఇచ్చారు. నిన్న విశాఖ సభకి అశేష స్పందన వచ్చిందని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మోడీ వైజాగ్ సభలో ప్రజలు కేరింతలు చుస్తే ఏపీ లో బీజేపీ బలం కనిపిస్తుందని ఆయన అన్నారు. మోదీ నిజమైన హీరోలా ప్రజలందరూ ఆయన ని చూస్తున్నారు. ప్రజలకి మోదీ పై అత్యంత నమ్మకం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ పై మెరుపుదాడి చేసిన ఘనత మోడీ కే దక్కుతుందని జీవిఎల్ అన్నారు. పాకిస్థాన్ మెడలు వంచి అభినందన్ ని భారత్ కి అప్పగించేలా చేశారు. ప్రపంచ దేశాలు మోడీ ని గౌరవిస్తే మన దేశ రాజకీయ నేతలు అగౌరవ పరిచారు అని ఆయన మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. (పవన్ కళ్యాణ్) పీకే అంటే పాకిస్తాన్ మనిషి అని పాకిస్తాన్ భావిస్తుంది అని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలు వెనుక చంద్రబాబు ఉన్నారు అధికారానికి రావడానికి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అనే డైలాగ్ ని పవన్ నిజం చేస్తున్నాడు అని ఆయన అన్నారు. వాల్తేర్ డివిజన్ అంశంలో చంద్రబాబు లా లొల్లి రాజకీయాలు మాకు చేత కావు అని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు. రైల్వే జోన్ అనేది అక్కడ ఉన్న వాస్తవ పరిస్తుతులని బట్టి ఇస్తారు..డబ్బులు ఉన్న డివిజన్, డబ్బులు లేని డివిజన్ అని బేధాలు ఉండవు అలా చూసి ఇవ్వరు అని ఆయన అన్నారు.