బాబుకి మోహన్ బాబు భాహిరంగ లేఖ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపి ప్రభుత్వానికి సినీ నటుడు మోహన్ బాబు అల్టిమేటం జారీ చేశారు ఈ భహిరంగ లేఖ లో ఆయన బాబు ఇచ్చిన హామీల గురించి, చేస్తున్న అన్యాయాని గురించి రాశాడు. ఫీజు రీఇంబర్స్ మెంట్ గురించి ప్రస్తావిస్తూ చెల్లించని బకాయిల గురించి తెలియజేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేకుంటే అంధోళనలకి ఆయన సిద్ధం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని హెచ్చరించారు.

భహిరంగ లేఖ లోని అంశాలు..

ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి, లేదంటే ఆంధోళనకు సిద్దం. కోట్లాది మంది విద్యార్థులకు గతంలో ఫీజు రీఇంబర్స్ మెంట్ ఫథకం ద్వారా ఎంతో మేలు జరిగింది. చంద్రబాబు నీవంటే నాకు చాలా గౌరవం, అయినా మాకు బకాయిలు చెల్లించలేదు. ఈ కాలేజీకి చంద్రబాబు అనేకమార్లు వచ్చారు. 2014 నుండి 18 వరకు 16 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు పాలసీలు ప్రవేశపెడతారు, కానీ వాటిని నెరవేర్చరు, విద్యార్తులకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వరు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ని కాదు, సిఎంకు అనేక మార్లు లేఖలు రాశాను, అయినా ఏమాత్రం స్పందించటం లేదు…

17-18 కొత్త రూల్ పెట్టారు, 3 మాసాలకు ఓసారి చెల్లిస్తామని చెప్పారు, కాని చెల్లించ లేదు. బిక్షం వేసినట్లు కొద్దిగా చెల్లిస్తున్నారు. ఇలాగైతే పిల్లలు ఎలా చదవాలి, టీచర్లకు జీతాలు ఎలా చెల్లించాలి. చంద్రబాబు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో. దాదాపు 16 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి, ఎంతకాలం ఇలా చేస్తావు…నాకు ఏ కులం లేదు, నేను అందరివాడ్ని. ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. నాణ్యత లేని విద్యను నేను ఇవ్వలేను కదా. నేను రాజకీయం కోసం మాట్లాడలేదు, మాకు అవమానం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే మరింత ఆందోళన కి మేం సిద్దం అంటూ మోహన్ బాబు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: