సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా-ఉమా

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయవాడ లో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన వై‌సి‌పి అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన జగన్ పై ఆయన ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీ‌ వెళ్లి ఏదేదో మాట్లాడాడు.. కనీస అవగాహన లేకుండా జగన్, వైసిపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఢిల్లీ‌వెళ్లి సిగ్గు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతావా..? ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పు ఇస్తే అసెంబ్లీ ని ఎగ్గొట్టావు.. నీకు ప్రజల సమస్యలు పట్టవు కానీ, అసెంబ్లీ రాకుండా జీతాలు పడతాయ..?

రాయలసీమ రైతాంగాన్ని అడిగితే టిడిపి చేసిన పనులు నీకే తెలుస్తాయి.. ఎవరెన్ని‌ కుట్రలు చేసినా చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలతో ప్రజలు టిడిపి కే పట్టం కడతారు. కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని ప్రాజెక్టు లను మేము పూర్తి చేసి చూపించాము.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అంగీకరించలేని మానసిక వ్యాది తో జగన్ ఉన్నాడు.. అందుకే ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జగన్ విషం చిమ్ముతున్నారు..

ముఖ్యమంత్రి పదవి జగన్ స్వప్నం అంట.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు‌ దోచుకున్నావు.. 16నెలలు జైలుకెళ్లావు, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతావు.. మొన్న మోడి వచ్చి హామీలు ఇవ్వకుండా పోతే ఇదేమిటని జగన్ అడగలేకపోయాడు.. జగన్ వెయ్యి కోట్లకు కేసిఆర్ కు అమ్ముడుపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు.. ఇప్పటికే ఐదు వందల కోట్లు జగన్ చేతికి చేరాయి.. సొంతం గా చంద్రబాబు ను ఎదుర్కోలేక కేసిఆర్, మోడి, ఒవైసి లతో చేరి జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి నీకు వాళ్ళే సరయిన జవాబు చెబుతారు అని ఉమా అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: