అభినందన్ వర్థమాన్ పాక్ చెర లో నుండి దేశానికి చేరుకున్నారు. దేశం అంతా అభినందన్ కి ఘనా స్వాగతం పలికారు. దాదాపుగా రెండు రోజులు ఎక్కడ చూసిన అభినందన్ పాటే వినిపించింది. ఈ నోట విన్న ఇదే మాట ఆకరికి గూగుల్ కీవర్డ్స్ లో కూడా ఇదే టాప్ లో నిలిచింది. ట్విటర్ లో అయితే అభినందన్ పై ట్వీట్ల వర్షం కురిసింది.
ఇది ఇలా ఉంటే గూగుల్ లో మరో అంశం కూడా టాప్ ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం అదే అభినందన్ కులం.. ఆశ్చర్యపడుతున్నారా..? అవును అభినందన్ ఏ కాకుండా అభినందన్ కులం కూడా టాప్ లో నిలిచింది. అభినందన్ అని టైప్ చేయగానే ఆయన ఏ కులానికి చెందిన వాడు? వర్థమాన్ కులం ఏంటి? వర్థమాన్ జైన్? అభినందన్ జైన్ కులం… అంటూ కనపడుతున్నాయంటే ఆశ్చర్యపోకండి.
ఇలా నెటిజన్లు తెగ వెతికారు. అయితే దేశ వ్యాప్తంగా అభినందన్ కులం గురించి ఎక్కువగా వెతికినా రాష్ట్రం మరేదో కాదు సాక్షాత్తు ప్రధాని మోదీ ఇదివరకు ఏలీన గుజరాత్. ఈ లిస్ట్ లో మన తెలుగు రాష్ట్రాల పేర్లు కూడా ఉన్నాయి కానీ అన్నిటికన్నా ఎక్కువగా వెతికింది మాత్రం గుజరాత్ కావడం గమనార్హం. ఇలా వెతకడం కొత్తేమీ కాదు.. ఇది వరకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్ సిల్వర్ మెడల్ సాధించినప్పుడు కూడా జనం ఆమె కులం గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. అలాగే, ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్లో హిమాదాస్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు కూడా నెటిజన్లు ఆమె కులం గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు.