సర్జికల్ స్ట్రైక్ కి చక్కటి ఆధారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ ఉగ్ర దాడుల తరువాత ప్రతీకారం తీర్చుకోడానికి ప్రధాని అజ్ఞ్యాల మేరకు భారత ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. దాదాపుగా వేయి కిలోల ఆర్‌డి‌ఎక్స్ కలిగిన బాంబులని విసిరింది. పాకిస్తాన్ భూగర్భం లోని బాల్కోట్ ఉగ్ర శిక్షణ శిబిరాలపై టార్గెట్ గా ఈ దాడి చేసింది. భారత ప్రభుత్వం కానీ భారత ఎయిర్ ఫోర్స్ కానీ ఎంతమంది చనిపోయారు అనే దానిపై స్పష్టత ఇవ్వనప్పటికి దాదాపుగా 300 మంది వరకు మరణించి ఉంటారు అని ఒక వార్తా ప్రచూరితమైంది.

ఈ క్రమంలో భారత ప్రజలు అందరూ దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు చనిపోయిఉంటారు అనుకునే లోపే పాక్ మంత్రి ఒకరు భారత్ కేవలం పర్యావరణాన్ని మాత్రం నాశనం చేసింది ఈ దాడిలో ఎటువంటి ఉగ్రవాదులు చనిపోలేదు అని ప్రకటించాడు. ఇక పోతే అంతర్జాతీయ మెడియ కూడా ఈ వార్తా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోడం గమనార్హం. ప్రాణ నష్టం చాలా తక్కువే అయ్యి ఉంటుంది అని మెడియ అఞ్చానా వేసింది. ఇక అప్పటి నుండి భారత ప్రజల్లో ఒక అనుమానం మోదలైంది.. అసలు సర్జికల్ స్ట్రైక్ లో ఉగ్ర వాదులు చనిపోయారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వ ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోడి సర్కార్ పై నిప్పులు చెరిగింది. ఇదంతా కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేశారని. 300 మంది చనిపోయారు అనే వార్తా కేవలం ఒక పుకారు మాత్రమే అని మోదీ పై నిప్పులు చెరిగారు. ఇక ట్విట్టర్ లో ఆధారాలు బయటపెట్టమంటూ ఒకటే ట్వీట్లు. కానీ ఇప్పుడు ఈ సందేహాలు.. ప్రశ్నలన్నిటికి ఒక చిన్న క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది.

భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఎంత మంది చనిపోయారనే దానికి ఇప్పుడొక ఆధారం దొరికింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. బాలాకోట్‌లో వాయుసేన దాడులకు ముందు రోజు వరకు అక్కడ 300 సెల్‌ఫోన్ కనెక్షన్లు మనుగడలో ఉండేవి. అయితే, భారత వాయుసేన జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత.. అవి పనిచేయడం లేదు. అక్కడ సిగ్నల్స్ అన్నీ ధ్వంసమైపోయాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి మొబైల్ కనెక్షన్లూ యాక్టివ్ మోడ్ లేవని చెప్పింది.

Share.

Comments are closed.

%d bloggers like this: