భార్య భర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్త హద్దు దాటాయి పక్కన ఎవరున్నారు అని కూడా చూడకుండా ఇద్దారూ కొట్టుకున్నారు. భార్య భర్తని కొడుతున్న క్రమంలో అవి కొడుకు కంట పడ్డాయి. ఇక ఆ తండ్రి తీవ్ర మనస్తాపం చెంది బాధతో ఆత్మ హత్యకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రం లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్నాటక రాష్ట్రం దాసరపల్లి ప్రాంటానికి చెందిన డొడ్డయ్య కొబ్బరి తోటలో పని చేస్తున్నాడు. దొడ్డయ్య కి పదేళ్ళ కింద పెళ్లయ్యి ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇటీవలే దొడ్డయ్యకి తన భార్య తో గొడవలు అవుతున్నాయి. ఈ కలహాలు ఒకరి పై ఒకరు చేతు చేసుకునే స్థితికి చేరాయి.
భార్య కొద్ది రోజులుగా భర్తని కొట్టడం ప్రారంభించింది. ఇక తాజాగా భార్య దొడ్డయ్యని కొట్టిన సమయం లో ఆ దృశ్యాలు దొడ్డయ్య కొడుకు కంట పడ్డాయి ఇది గమనించిన దొడ్డయ్య తన కొడుకు ముందు తన పరువు పోయింది అని బాధ పడ్డాడు.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక దిక్కు తోచని స్థితిలో దొడ్డయ్య ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.