ఆ నటి.. నాడు కాంగ్రెస్.. నిన్న టీడీపీ.. నేడు వైసీపీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి జయసుధ ఈవిడ తెలుగు నటి.. నటనలోనే కాకుండా రాజకీయాల్లోనూ తన ప్రతిభాని చాటుకున్నా నటి. జయసుధ కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. అయితే ఆంధ్ర లో వలసల సంగతి తెలిసిందే.. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు జగన్ సమక్షంలో చీరుతున్నారు. అయితే ఇదే నేపధ్యంలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ య్సీపీ అధ్యక్షుడు జగన్ సమక్షం లో వైసీపీ పార్టీ లో చేరబోతుంది. గురువారం సాయంత్రం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను ఆమె కలవనున్నారు. జగన్ సమక్షంలో జయసుధ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జయసుధకు టిక్కెట్టు దక్కడంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం జయసుధ టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆమె కలిశారు. భర్త బతికున్న సమయంలోనే జయసుధ బాబుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరారు.

టీడీపీ లో చేరారు కానీ ఆ పార్టీలో ఆమె ఏనాడూ ఉత్సాహంగా పాల్గొనలేదు. అయితే గురువారం సాయంత్రం జయసుధ వైసీపీ చీఫ్ జగన్‌తో భేటీ కానున్నారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె చేరుతున్నారు అనే వార్తా వినిపిస్తుంది కానీ ఆమె ఈసారి పోటీ చేస్తున్నారో లేదో అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: