ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలు రోజురోజుకీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరి పై ఒకరరు మాటల దాడులు చేసుకుంటున్నారు. నేతలు పార్టీలు మారుతున్నారు. ఒకరి దేగ్గర అనుభవం ఉంటే.. ఒకరి దేగ్గర యువ రక్తం ఉంది. మరొకరి దేగ్గర విప్లవ భావాలు ఉన్నాయి. వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఎవరు కుట్ర పన్నారో ఎవరు బయట పెట్టారో తెలియట్లేదు. మరోపక్క పార్టీ అధినేతలు ఎన్నికలు దేగ్గరపడుతున్నాయని వ్యూహాలు కార్యాచరణలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వ్యూహం సిద్ధం చేస్కున్నారట. ఎన్నికల ప్రచారానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని చంద్రబాబు ఎన్నికలకీ సై అంటున్నారు. ఎన్నికల ప్రచారం కు సిద్దమైన చంద్రబాబు…ఈ నెల 16 నుండి ప్రజా దర్బార్ పేరు తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రజా దర్బార్ లో రోజు రోడ్డు షోలతో పాటు ఒక బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఇలా ఉంటే టీడీపీ పార్లమెంట్ భేటీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఇక ఈ నెల 10 నుండి 15 లోపు టీడీపీ అభ్యర్థులు లిస్టు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం.