అల్లు అర్జున్ సినిమా వ్యవహారాలు చూసుకుంటూ.. గీతా ఆర్ట్స్ పనుల్లో పాల్గొంటూ గీతా ఆర్ట్స్ బ్యానర్ కే ఒక కీలకమైన వ్యక్తిగా మారాడు బన్నీ వాసు.. ఎప్పుడూ బన్నీ తో ఉండటం వల్ల ఈయనకి బన్నీ వాసు అని పేరు కూడా పడిపోయింది. ఇక అక్కడనుంచి మొదలయ్యింది బన్నీ వాసు కథ.. అలా బన్నీ పనులు చూసుకునే వాడు నేడు ప్రొడ్యూసర్ గా కూడా మారిపోయాడు. సినిమా పనులు చూసుకుంటూ అలా అలా..సొంతంగా సినిమాలు తీస్తూ ప్రొడ్యూసర్ గా మారాడు బన్నీ వాసు.
ఇక ఇప్పుడు బన్నీ వాసు కళ్ళు రాజకీయాలపై పడ్డాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన వైపు బన్నీ వాసు మొగ్గ చూపుతున్నాడు. కొంత కాలంగా అల్లు ఫ్యామిలీకీ పవన్ కళ్యాణ్ కి మద్య విభేదాలు నడిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ విభేదాలు దూరమయ్యాయి. ఇక అప్పటినుండి బన్నీ వాసు జనసేన టికెట్ సంపాదించాలని తహతహలాడుతున్నాడట.
అల్లు అర్జున్ స్వస్థలమైన పాలకొల్లు నియోజకవర్గం నుండి బన్నీ వాసు జనసేన పార్టీ తరఫున బరిలో దిగుతాడని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం సంగతి పక్కన పెడితే బన్నీ వాసుకి జనసేన పార్టీలో చోటు మాత్రం కన్ఫార్మ్ అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ నెల 14న రాజమండ్రిలో జరిగే జనసేన ఆవిర్భావ సభని పర్యవేక్షించే కమిటీ సభ్యుల్లో బన్నీ వాసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ సభ్యులందరికీ జనసేన పార్టీ తరఫున టికెట్ ఖాయమని చెబుతున్నారు. దాదాపు పదిహేను మంది కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీ స్వస్థలం కావడంతో పాలకొల్లులో బన్నీ వాసుకి కాస్త ఫాలోయింగ్ ఏర్పడింది.