పక్షి ఢీకొంటే.. విమానం కూలింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత ఎయిర్ ఫోర్స్ కి చందిన మిగ్ 21 ఫైటర్ జెట్ నేడు కుప్పకూలింది. అది కూడా కేవలం ఒక పక్షి ఢీకొనడంతో..! పక్షి యుద్ద విమానాన్ని ఢీకొంటే.. నిస్సందేహంగా పక్షే కదా పోవాల్సింది కానీ విడ్డూరంగా యుద్ద విమానం కుప్పకూలింది.. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పైలట్ ఫ్రాణాలతో భయటపడ్డాడు.. ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు. ఫ్లైట్ కుప్పకూలే ముందే పైలట్ విమానం నుండి బయటపడ్డాడు.

రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభాసర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని నాల్‌ ఎయిర్‌బేస్‌కు మిగ్‌-21ను తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. శిక్షణ లో భాగంగా ఈ ఘటన జరగడం గమనార్హం. పక్షి ఢీకొనడంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ మిగ్ విమానాలను భారత్ సోవియట్‌ యూనియన్‌ నుంచి కొనుగోలు చేశారు. 2006లో వీటిని మిగ్‌-21 బైసన్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇదివరకు జరిగిన సర్జికల్ స్త్రీక్స్ లో భారత ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధ విమానాన్నే ఉపయోగించింది. మొన్న భారత్ లోకి చొరబడ్డ పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16 ని సైతం మిగ్ 21 విమానమే తరిమి కొట్టింది. అటువంటి విమానం ఇలా పక్షి ధీకొంటే కుప్పకూలడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: