దర్శకుడే ఊహించని రీతిలో డియర్ కామ్రేడ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు. తాను పట్టిందల్లా బంగారంగా ఉంది విజయ్ ఫెట్. ఫెట్ అనే కాదు దాని వెనుక విజయ్ కష్టం కూడా అదే స్థాయి లో ఉంది అనే చెప్పాలి వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు విజయ్ దేవరకొండ.. వరుస విజయాలతో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని కూడా సంపాదించుకున్నాడు ఈ యువ హీరో.. కేవలం తెలుగు లోనే కాకుండా వివిద బాషల్లో ఈయనకి ఇప్పుడూ అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. పెళ్లి చూపులు తో ఫేమ్ అయిన విజయ్ అర్జున్ రెడ్డితో 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు.

అయితే ఈ యువ హీరో యువ డైరెక్టర్ల జీవితాలని కూడా మార్చేస్తున్నాడు. మొన్న ట్యాక్సీవాల తో ఒక యువ దిరెక్టర్ ని ఇందస్త్రికి పరిచయం చేయగా నేడు డియర్ కామ్రేడ్ తో మరో యువ డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు.. ఆ యువ దిరెక్టరే భారత్ కమ్మా.. భారత్ కమ్మ పై విజయ్ కి మంచి ఒపీనియన్ ఉందట.. తన షార్ట్ ఫిల్మ్స్ ని చూసిన విజయ్ భారత్ ని పిలిచి నీతో సినిమా తీస్తా అన్నాడు ఇక అంటే ఆ గడియ ఇప్పుడొచ్చింది. విజయ్ కి ఇప్పుడు భారీ మార్కెట్ ఉండటం వల్ల ఈ సినిమాని చేయడానికి బడా ప్రొడ్యూసర్లు ముందుకొస్తున్నారు.. ఈ సినిమా ని తీయడానికి మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చింది.. ఈ సినిమాని తెలుగు తమిళ కన్నడ మలయాళ బాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఇలా జరుగుతుందని భారత్ అస్సలు ఊహించలేదట. తన మొదటి సినిమా ఇంత పెద్ద బ్యానర్ పై వస్తుందని కానీ ఇన్ని బాషల్లో వస్తుందని కానీ భారత్ అస్సలు ఊహించలేదట. ఇక ఈ సినిమా కూడా హిట్ కొట్టిందంటే ఇక భారత్ రేంజ్ పెరిగిపోవటం ఖాయం..!

Share.

Comments are closed.

%d bloggers like this: