కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ కొట్టినంత పనయ్యింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోం మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతుంది. ఈ విషయమై ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసుకుంది. తనకి మంత్రి పదవి, కొడుకు కార్తిక్ రెడ్డి కి ఎంపీ టికెట్ ని టీఆర్ఎస్ టేబుల్ పై పెట్టింది.. ఈ విషయమై ఇప్పటికే కేటిఆర్ కవితా తో చర్చలు కసరత్తులు చేసినట్టు సమాచారం. వాళ్ళు ఒకే చెప్పడం తో త్వరలో పార్టినీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. తనతో పాటు అనేక మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు సైతం కార్ ఎక్కనున్నారని సమాచారం.
ఆదివారం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ నివాసంలో కేటీఆర్, కవితతో సమావేశమైన సబిత కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సబిత గనుక టీఆర్ఎస్లో చేరితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కాకుండా ఆమె రాకతో చేవెళ్లతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ బలం పెరుగుతుందని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ రాయబారం ద్వారా ఆమె తమ పార్టీలోకి వచ్చేలా కేటీఆర్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకోవాలని ఆశిస్తున్న టీఆర్ఎస్కు చేవెళ్ల నియోజకవర్గంపై కొన్ని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సబితను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని భరిలోకి దించాలని భావించిన టీఆర్ఎస్ తాజాగా ఆ ప్రతిపాదనను పక్కన పెటినట్లు తెలుస్తోంది. చేవెళ్ళ లో సబితకీ మంచి ఓట్ బ్యాంక్ ఉందని పార్టీ భావిస్తున్న నేపధ్యం లో కార్తిక్ రెడ్డి కీ ఎంపీ టికెట్ కన్ఫామ్ అయినట్టు సమాచారం వస్తుంది.