ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాజుకున్న అగ్గిలా మారాయి. ఎన్నికల తేదీ కూడా కన్ఫామ్ అయిపోయింది కానీ ఈ సమయం లో కూడా కొత్త నేతలు పార్టీల్లోకి వస్తున్నారు.. పాత నేతలు పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఈ పార్టీ వారు ఆ పార్టీ లోకి ఆ పార్టీ వారు ఈ పార్టీలోకి మారుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎందుకు మారుతున్నారో తెలియని పరిస్తితి. అసలెందుకు నేతలు పార్టీలు మారుతున్నారు దీని వెనక ఎవరి ప్రోత్బలం ఉంది అనే ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.
జగన్ పార్టీలోకి అయితే నేతలు వలసలు కడుతున్నారు. ఇది ఒక రకంగా ప్లస్ అయినప్పటికీ మరో రకంగా మినస్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కసారిగా అనేకమంది పార్టీలోకీ వచ్చేసరికీ సీట్ల సద్ధుబాటులో జగన్ సతమతమవుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు అలీ వైసీపీ లోకి అడుగు పెట్టారు. అయితే అలీ కొంత కాలంగా పార్టీ అధినేతలతో వరుస భేటీలు పెట్టి ఏ పార్టీలోకి వెళుతున్నారో అని జనాన్ని ఉత్కంటలో ఉంచారు. అయితే కొద్ది రోజులుగా అలీ టీడీపీ లో చేరబోతున్నారని ఆయనకి బాబు గుంటూరు పడమర టికెట్ కూడా ఇస్తున్నాడని ప్రచారం జోరుగా సాగింది. కానీ అలీ ఉన్నట్టుండి వైసీపీ లోకి అడుగు పెట్టి జనాన్ని అనేక సందేహాలకి గురి చేశారు.
ఇది కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలని దృష్టి లో పెట్టుకొని జగన్ పట్టాన చెరీ అనేక కుట్రాలకి అనైతిక
రాజకీయాలకి పాల్పడుతున్నారని కూడా ప్రచారం లేకపోలేదు. ఇది ఇలా ఉంటే టీడీపీ పార్టీ తమకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగిస్తుందని డేటా చోరీకీ పాల్పడుతుందని వివాదాలు చక్కర్లు కొట్టాయి. ఇక జగన్ ఫారం 7 పేరున తనకి వ్యతిరేక ఓటర్లు తొలగిస్తున్నారని ఇంకొక ప్రచారం. అసలు ఏది నిజం..? ఏం జరుగుతుంది..? ఏం జరగబోతుంది..? ఎవరు సరైన వారు..? ఎవరు ఆంధ్ర ప్రదేశ్ కీ సరైన మార్గదర్శి అని జనం తికమక పడిపోతున్నారు.