టెక్నికల్ దొంగలు..! 4 లెవల్స్ లో ఫోన్ ఫసక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దొంగాలిస్తారు.. సాఫ్ట్ వేర్ మారుస్తారు.. ముస్తాబు చేస్తారు.. కోత్తవని తిరిగి అమ్మేస్తారు..! దొంగలు కూడా ఈమద్య టెక్నాలజీ వాడుతున్నారు.. రోజురోజుకి అప్గ్రేడ్ అవుతున్నారు. యూట్యూబ్ ద్వారా సాఫ్ట్ వేర్ బ్రేక్ చేయడం IMEI నూబార్ ను మార్చడం నేర్చుకుంటున్నారు. తాజాగా ఒక ముఠా అందులో అందరూ 25 లోపు కుర్రాల్లే రద్దీ ఏరియాలే వీరి టార్గెట్లు అమాయకులని చూసి ఫోన్లు దొంగలించడమే వీరి పని. ఆపై సాఫ్ట్వేర్ బ్రేక్ చేస్తారు కొత్తవిగా చేసి మళ్ళీ మార్కెట్ లో అమ్మేస్తారు.

ఈ ముఠాలో నలుగురు ఉంటారు ఒకరు ఫోన్ దొంగాలిస్తాడు, ఆపై ఫోన్ ని రెండో వాడికిస్తాడు. ఆ రెండవ వాడు ఇంకొంత దూరం వెళ్ళి మూడవ వాడికి ఇస్తాడు.. మూడవ వాడు ఇంకొంత దూరం వెళ్ళి నాల్గవ వాడికి అందిస్తాడు. ఆ నాల్గవ వాడు ఫోన్ లో సాఫ్ట్ వేర్ ని బ్రేక్ చేసి IMEI నంబర్ మారుస్తాడు. ఇక అంతే ఒక్కసారి IMEI నెంబర్ బ్రేక్ చేస్తే పోలీసులు కూడా ట్రాక్ చేయలేరు. ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఏమి చేయలేరు.

ఇక ఫోన్ సాఫ్ట్ వేర్ మార్చేసి కొత్త IMEI నెంబర్ క్రియేట్ చేస్తారు.. ఆ ఫోన్ ని మళ్ళీ కొత్తగా చేసి మళ్ళీ మార్కెట్ లోకి పంపిస్తారు. కొత్త ఫోన్లు అని మళ్ళీ మార్కెట్ ధరకి అమ్మేస్తారు. అయితే ఈ ముఠా ముంబై కి చెందింది ఇలా వీళ్ళు వందల ఫోన్లు అమ్మేసి ఇప్పటికీ చాలా సంపాదించేశారు. అయితే తాజాగా ముంబయి లో ఈ ముఠా పోలీసులకి చిక్కింది. పోలీసులు వీరి వద్ద 75 ఖరీదైన ఫోన్లు స్వాదీనమ్ చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసుకొని తదుపరి విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: