తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం బహిరంగ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అన్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం గా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అని ఆయన అన్నారు. ఇలాంటి మోసపూరితమైన వ్యక్తి రాజకీయాల్లో ఎవ్వరూ ఉండరు అని ఆయన అన్నారు. తన స్వార్ధం కోసం రాష్ట్రాన్ని జనాన్ని అన్నిటినీ తాకట్టు పెట్టె వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల పై తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆయన అన్నాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ జగన్ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే తాను కొన్ని సంస్థలను వదులు కోవాల్సి వచ్చిందంటూ బాబు మాట్లాడటం బాధాకరమన్నారు.