రాజన్న ఆశయాలకీ.. రైతన్న పార్టీకీ.. 9 ఏళ్ళు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేకర్ రెడ్డి ఈయన పేరు తెలియని తెలుగు వాడు ఉండడు. ఈయన విగ్రహం లేని పల్లె ఉండదు..! వైఎస్ రాజశేకర్ రెడ్డి చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విధ్యా..! రైతులకి ఋణ మాఫీ, నిమిషాల్లో 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ ఇలా పేదల కొరకు ఎన్నో సంక్షేమ పాతకాలాని ఈయన అమలు లోకి తీసుకొచ్చారు.. ఈయన చేసిన సేవకీ ప్రజలు ఇంకా కృతజ్ఞులుగా ఉన్నారు. అలాంటి వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి తరహాలోనే పని చేస్తున్నారు. తన తండ్రి మరణం తరువాతా తన తండ్రి ఆశయాల సాధనకీ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీ ఏ YSRCP యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ..! ఈ పార్టీని 12 మార్చి 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేటి తో పార్టీ పెట్టి 9 సంవత్సరాలు.

తన తండ్రి లాగానే జగన్ కూడా పాద యాత్ర లు చేపట్టారు.. తన కాళ్ళ మీద ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టేశారు. ప్రతీ ఊరికి ప్రటీ వీధికి ప్రతీ ఇంటికి తిరిగాడు పేదల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాడు.. నేనోస్తా మీ కష్టాలు తీరుస్తా అంటూ ప్రతీ వ్యక్తిని పలకరించాడు. ఇలా తన ఆశయాలని రాజన్న ఆశయాలని రాష్ట్రాన్ని తన సంక్షేమ పాతకాలతో ఎలా ముందుకి తీసుకెళతాడో అందరికీ తెలియజేస్తూ పార్టీ గురించి పార్టీ బలాన్ని పెంచడానికీ ఎంతగానో కష్టపడ్డాడు.. నేడు తెలుగుదేశం పార్టీకీ పోటీగా నిలిచాడు, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షంలో నిలిచాడు.. ఇక ఈసారి జరగబోయే ఎన్నికల్లో నువ్వా నేనా అన్న స్థాయికి ఈయన చేరుకున్నాడు.

నేటితో పార్టీ ఆవిర్భవించి 9 సంవత్సరాలు అయిన సంధర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన సంతోషాన్ని తెలియజేస్తూ.. ఒక ట్వీట్ చేశాడు.. ఆయన మాట్లాడుతూ.. ‘మహానేత ఆశయాలను, పధకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాలమీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు. #YSRCP అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఇవన్నీ ఇలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు.. ముక్కు సూటితనం అనుభవం, రాజకీయం అన్నిటికన్నా మించి తన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చంద్రబాబు ఆయుదాలు.. ఇక ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి ఎవరికి వోటు వేయాలో అది ప్రజలే నిర్ణయించాలి.. వారికి అనుభవం కావాలో యువ శక్తి కావాలో వారే నిర్ణయిస్తారు..

Share.

Comments are closed.

%d bloggers like this: