వార్నరా..? కేనా..? హైదరబాద్ కెప్టెన్ ఎవరు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మరో పదకొండు రోజుల్లో ఐపీఎల్ ఆటలు ప్రారంభం కానున్నాయి. మార్చి 23 నుండి ఆటలు కొనసాగుతాయి.. గతేడాది సంరిజర్స్ హైదరబాద్ జట్టు అద్భుతమైన ప్రతిభాని కనబరిచి ఫైనల్ వరకు చేరుకుంది. కానీ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంగిట బోల్తా పడింది. ఫైనల్ వరకు అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ బయపెట్టిన హైదరబాద్ బౌలర్లు చివరి మ్యాచ్ లో విఫలమవ్వడం తో ఫైనల్ లో కప్ గెలవలేక పోయింది అయితే గతేడాది కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ అటు బ్యాటింగ్ లోనూ సారద్యం లోనూ నంబర్ వన్ గా నిలిచాడు.

కానీ మ్యాచ్ లు మొదలయ్యే కొన్ని రోజుల ముందే కేన్ ఇంజూర్ అవ్వడం సంరైజర్స్ అభిమానులని కాస్త బాధకి గురి చేస్తుంది. బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఈ న్యూజిలాండ్ కెప్టెన్ గాయపడ్డాడు. వెంటనే.. సమీపంలోని ఆసుపత్రికి అతడ్ని తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు స్కానింగ్ తీసిన తర్వాత.. గాయం తీవ్రత దృష్ట్యా కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు, ఇక డేవిడ్ వార్నర్ కూడా సంరైజర్స్ కి కెప్టెన్ గా బాధ్యతలు వహించైనా విషయం తెలిసిందే.. అయితే వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం లో అతని పై ఐసి్‌సి నిషేదం ప్రకటించిది కాగా ఈ నిషేదం ఈ నెల 28 న ముగియనుంది. నిషేదం ముగిసిన వెంటనే వార్నర్ సంరైజర్స్ లో ఆడుతాడు. ఇక విలియంసన్ ఎప్పుడు మ్యాచ్ లకి వస్తాడా అనే విషయం పై ఇంకా క్లారీటీ రాలేదు.. ఇక వార్నర్ 28 న వస్తున్నాడు. దీంతో హయ్దేరాబాద్ ని ఎవరు లీడ్ చేయబోతున్నారు అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: