పాక్ లో అభినందన్ పోస్టర్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాకిస్తాన్ యుద్ధ విమానాలని తరుముతు వారి సరిహద్దులోకి సైతం ప్రవేశించి మళ్ళీ సాదరంగా తిరిగి భారత్ కి వచ్చిన అభినందన్ కి మన దేశంలో చాలానే ఫాలోయింగ్ వచ్చింది. తన మీసాల స్టైల్ కి మంచి మార్కెట్ కూడా వచ్చేసింది. అంతే కాకుండా అన్నీ వర్గాల వ్యాపారులు అభినందన్ కలెక్షన్స్ పేరిట ఆయన ఫోటోలని పెట్టుకొని అమ్మకాలు చేసుకుంటున్నారు. ఇక మన దేశం లోనే ఇలా ఉంటే తాజాగా ఆయనకి పాక్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

పాక్ లో ఇటీవలే స్నేహదూత్‌ అంటూ ఆయన ఫొటోతో పోస్టర్లు వెలుస్తున్నాయి. తాజాగా ఒక టీ స్టాల్ యజమాని అభినందన్‌ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని తన స్టాల్‌ ముందు వేలాడదీశాడు. అభినందన్‌ను స్నేహదూత్‌గా ఆ ఫ్లెక్సీలో అభివర్ణించాడు. పనిలో పనిగా తన టీకి కితాబిచ్చుకున్నాడు. ‘ఇటువంటి టీ ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుంది’ అంటూ ఫ్లెక్సీపై ముద్రించాడు. ఇప్పుడు ఈ వార్తా వైరల్ అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: