తప్పులు.. డ్రామాలు నీకు అలవాటు నాకు కాదు-బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ని రాయకీయం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.. ప్రతీ దాన్ని రాజకీయం చేయడం జగన్ కి అలవాటయ్యిందని ఆయన అన్నారు. నేడు ఉదయం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ పై ఫైర్ అయ్యారు. శుక్రవారం జగన్ చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి గురయ్యారు. ఇక ఆయన మారణం అనుమానాస్పద రీతిలో అయ్యేసరికీ ఇరు పార్టీ నేతలు ఒకరి పై ఒకరు అనుమానాలు వ్యక్తం చేశారు.. ఈ సంధర్భంగా వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేశ్ లకి సంభందం ఉందంటూ వ్యాఖ్యానించారి ఇదే రీతిలో వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుకి ఈ హత్యతో సంభందం ఉందని వ్యాఖ్యలు చేశారు.

ఇక నేడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. బాబు మాట్లాడుతూ.. జగన్ కి ప్రతీదీ రాజకీయం చేయడం అలవాటైయ్యిందని ఈ కేసు ని తనకి అంతగాడుతున్నారని.. ఇవన్నీ అవాస్తవాలని వాటిని కొట్టిపారేశారు. తన బాబ్యి హత్యని కూడా జగన్ రాజకీయం చేయడం తగినది కాదని ఆయన అన్నారు. వివేకా హత్య వాళ్ల ఊళ్లో.. వాళ్ల ఇంట్లో జరిగిందని.. దీనికి టీడీపీని నిందించడం అమానుషమన్నారు. తప్పులు చేసి తప్పించుకోవడం జగన్ దురలవాటని ఆయన అన్నారు. వ్యాపారంలో, రాజకీయంలో జగన్ అడ్డదారి, చెడ్డదారి చూసుకుంటారని ఆరోపించారు. జగన్ ఏరంగంలోకి అడుగుపెడితే.. ఆ రంగంలో అప్రదిష్ట అని అననారు.

Share.

Comments are closed.

%d bloggers like this: