మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మి నారాయణ నిన్న రాతిరి వంటి గంటల ప్రాంతానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని విజయవాడ లోని పార్టీ కార్యాలయం లో కలిశారు. ఇద్దరూ 45 నిమిషాల పాటు సుధీర్గంగా చర్చించారు. ఇక చర్చ అనంతరం జెడీ జనసేన లోకి రావాలని నిశ్చయించుకున్నారు. ఈ సంధర్భంగా నేడు జనసేన ప్రాచారమ్ లో భాగంగా పవన్ సభ ని నిర్వహించారు. ఈ సభ వేధికగా జెడి లక్ష్మి నారాయణ, విద్యావేత్త, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ రాజగోపాల్ ఇద్దరూ పార్టీలో పవన్ సమక్షం లో చేరారు.
సభ లో పవన్ మాట్లాడుతూ.. జనసేన ఆవిర్బావం ముందే నేను జెడి లక్ష్మీ నారాయణని కలిసి మాట్లాడాను.. అప్పుడే కలిసి పని చేయాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆయనతో కలిసి పనిచేయాలని 2014 లో అనుకున్నది 2019 లో సాధ్యం అయ్యింది.. నేడు రాజకీయం అంటే వేల కోట్లు కావాలి..! ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు యాభై, వంద కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపి, తెలంగాణలో డబ్బు రాజకీయాలు పెరిగిపోయాయి.. ధన ప్రవాహం చూసి ప్రజలు కూడా చీదరించు కుంటున్నారు. సమాజంలో మార్పు తీసుకు వచ్చేందుకు మేము రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజా సేవ చేయడానికి కోట్ల రూపాయలు ఎదురు పెట్టుబడులు పెట్టాలా..? డబ్బులతో ప్రమేయం లేకుండా ఎన్నికలకు వెళుతున్నాం.. అని ఆయన అన్నారు.
ఇక పార్టీ లోకి చేరిన అనంతరం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ‘ ఒక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ జనసేన స్థాపించారు. నవసమాజ నిర్మాణం కోసం మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆనాడు కుటుంబ సమస్యలు కారణంగా కుదరలేదు. ఈరోజు కలిసి పని చేసే అవకాశం కలిగింది. భారత దేశం యువతరంతో ఉత్సాహంగా ఉంది.. వచ్చే ఐదేళ్లలో వారికి మార్గం చూపితే దేశం రూపురేఖలే మారిపోతాయి. మార్పు తెచ్చే నేత పవన్ కళ్యాణ్..!
పవన్ మ్యానిఫెస్టో కూడా చాలా బాగుంది.. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంది.. ఇటువంటి మ్యానిఫెస్టో రూపొందించాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి.. డబ్బలు లేకుండా రాజకీయం జరగదు అన్న నేటి రోజుల్లో మార్పులు కోసం వచ్చారు.. జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.. ,మూడు లక్షణాలు పవన్ లో ఉన్నాయి. పార్టీ లోకి చేరడం సంతోషంగా ఉంది. నేటి నుంచి ఇక నేను కూడా జనసైనికునిగా ఉంటాను అంటూ ఆయన ముగించారు.