కేసీఆర్ దావూద్ ఇబ్రహీం లా మారాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శనివారం నాడు ఉదయం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో శ్రీశైలం గౌడ్ రేవంత్ రెడ్డి లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో భాగంగా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. కే‌సి‌ఆర్ పై టి‌ఆర్‌ఎస్ పార్టీ పై ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

రేవంత్ మాట్లాడుతూ..

కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. కేసీఆర్ సీఎం అయిన వెంటనే నియంతగా మారాడు, నియంతృత్వ పాలన ఎలాఉంటుందో కేసీఆర్ చూపిస్తున్నాడు. పార్టీని నమ్మి 88 స్థానాలు టీఆర్ఎస్ కు ప్రజలు ఇచ్చారు అయిన ఆయన మాత్రం మారడంలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే లను గొడ్డుల్లగా చూస్తూ పక్క పార్టీ వాళ్ళను పార్టీ లో చేర్చుకుంటుండు. రెండవ సారి సీఎం అయ్యాక కేసీఆర్ రాక్షసుడిలా మారాడు రక్షసత్వాన్ని చూపిస్తున్నాడు.

నేను ఇంట్లో ఉంటే ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి నన్ను పోటీ చేయమని అడిగారు, నేను సబితమ్మ ఇంటికి వెళ్లి అడిగినా నన్నే పోటీ చేయమని అడుగుతున్నారు, మిరే బాధ్యత తీసుకోవాలి అని అడిగినా, రేవంత్ పోటీ చెయి నేను చూసుకుంటా అని సబితక్క అన్నారు. కానీ ఇప్పుడు నా బంధువులు అందరూ కేసీఆర్ పక్కన చేరారు. బంధువులు అందరూ ఒక పక్కన ఉంటే నేను పోటీ చేయడం అవసరమా అనుకున్నా.. కానీ కేసీఆర్ లాంటి రాక్షసుని ఎదురుకోవడానికి తెప్పదు అనిపించింది. ఇతర పార్టీ ఎమ్మెల్యే లను బెదిరించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది ప్రజలను నమ్మి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా..! మల్కాజిగిరి మినీ భారత దేశం విచక్షణ తో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలి. మీ ప్రాంతం నుంచి ఎలాంటి వ్యక్తి ఉండాలో ప్రజలు ఆలోచించాలి చట్ట సభల్లో మీ సస్యలు లెవనెత్తె వాళ్లకు ఓటు వేయండి.

కేసీఆర్ కూడా దావుద్ ఇబ్రహీం లా తయారయ్యారు. 2014 లో కూడా 15 మంది ఎంపీ లు ఉంటే ఏం సాధించారు..? కంటోన్మెంట్ లో రోడ్డు కూడా సాధించలేదు..! ఇప్పుడు 16 మందిని గెలిపిస్తే ఏంచేస్తారు..? ఏమి చేయరు..! సారు కారు పదహారు అని కేటీఆర్ అంటున్నాడు కానీ తెలంగాణ ప్రజల్లో.. సారు కారు భేకారు అని ఉంది. బీజేపీ కి ఓటు వేస్తే మోదీ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాహుల్ మరి టిఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎవరు ప్రధాని. ఇవి జాతీయ పార్టీల ఎన్నికలు, టిఆర్ఎస్ ఆటలో అరటి పండు లాంటిది.
ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ.. 25 రోజులు నిరంతరంగా కాంగ్రెస్ కోసం పనిచేయండి, కంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా, పార్టీ జెండా మోసిని అందరికి ఇంతకు పదింతలు రుణం తీర్చుకుంటా, నేను ఇంకా 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా ప్రతి కార్యకర్త ఇంట్లో ఒకడిగా మీ కష్ట నష్టాల్లో ఉంటా..! ధర్మానికి అధర్మనికి పోరాటం జరుగుతుంది,.. ప్రజలు ధర్మం వైపు ఉండాలని కోరుకుంటున్న.

Share.

Comments are closed.

%d bloggers like this: