తమ తండ్రులు కష్టపడి మంచి హోదా కి వస్తే వారి పరువుని ప్రతిష్ట ని మట్టిలో కలుపడానికి పుత్రులు ఎగబడుతున్నారు. కష్టపడితే గాని ప్రభుత్వ ఉద్యోగం దక్కదు.. అలా కష్టపడి ఒక వ్యక్తి ఏసీపీ అయ్యాడు.. మంచి హోదా లో ఉన్నాడు. ఇక పుత్రుడు జల్సాలకి ఎగబడి తన తండ్రి హోదా ని అడ్డు పెట్టుకొని సాధారణ ప్రజల పై దాడులకి పాల్పడుతున్నాడు.. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఎన్నికల బరీ లో దిగి కష్టపడి ఎంపీ పదవి దక్కించుకున్నాడు మరో వ్యక్తి.. ఇక ఈ ఎంపీ పుత్ర రత్నం ది కూడా ఈశే పరిస్తితి. తన తండ్రి హోదా ని మంచి దారిలో వాడకుండా చెడు దారికి వాడాడు. సాధారణమైన వ్యక్తులపై దాడిలకి పాల్పడ్డాడు. ఇక ఈ ఇద్దరు పుత్ర రత్నాలు మిత్రులు..! ఇక వీరిద్దరు కలిస్తే ఇంకేమైయన ఉందా..!
ఈ ఇద్దరు పుత్ర రత్నాలు మద్యం తాగుతూ తమ బ్యాచ్ లని వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఇక మద్యం మత్తులో ఉన్న వీళ్ళు దారిన పోయే వారి దాడులకి పాల్పడ్డారు.. ఈ క్రమంలో రహదారి పై మద్యం తాగుతున్న వీరు దారిన పోయే వారిని వేధించడం ప్రారంభించారు.. ఆ దారిన పోయే ఓ వ్యక్తి వీరి కంటబడ్డాడు.. అగ్గి పెట్ట అడగగా లేదనడం టో వాగ్వాదానికి దిగారు. ఇక ఆ వ్యక్తిని ఫుల్ గా కొట్టారు. వీరికి తెలియందెంటంటే అటు పక్కనే ఉన్న సీసీ కేమరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.. ఇక ఆ అర్ధ రాత్రి ఆ బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అతనిని అక్కడే నిర్భందించి అక్కడనుండి కదలకుండా అతని సెల్ ఫోన్ తీసేసుకోని ఇప్పటి వరకు అక్కడే ఉంచారు.. పైగా అతని మీదే రిటర్న్ కాంప్లెయింట్ నమోదు చేశారు.. ఇది నేటి యువతరం పరిస్తితి..!