మరో పుల్వామ దాడి.. ఎక్కడంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్న భారత్ లో జరిగినట్టే మాలి లో ఉగ్రదాడి జరిగింది.. భారత్ లో పుల్వామ లో ఉగ్ర దాడి జరిగినప్పుడు దాదాపుగా 45 మంది జవాన్లు అమరులయ్యారు ఇక అదే నేపధ్యం లో మాలి లో ఓ స్థానిక సైన్య స్థావరం పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.. కార్లలో బైక్ల పై అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు సైనికులపై కాల్పులకి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 21 మంది సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

సైనిక స్థావరం పై దాఉలకి పాల్పడ్డ ఉగ్రవాదులు ఐసిస్ కి చెందిన వారీగా గుర్తించినట్టు సమాచారం వస్తుంది. పక్క ప్లాన్ తో అక్కడికి చేరుకున్నారు ఉగ్రవాదులు.. ద్వి చక్ర వాహనాలపై కార్ల లో అక్కడికి చేరుకున్నారు.. వారి నాయకుడి సమక్షం లో అక్కడికి చేరుకున్నారు. వారి నాయకుడు అనుమతివ్వగానే కాల్పులకి దిగారు. ఈ దాడిలో 21 మంది సైనికులు ప్రాణాలు విడువటం ప్రపంచాన్నే కలచి వేస్తుంది.

ఓ మాజీ సైనికాధికారి నాయకత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే ఆ దాడికి పాల్పడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మాలిలో ఐసిస్ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. 2012లో ఉగ్రవాదులు దేశ ఉత్తర ప్రాంతంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోగా.. 2013లో ఫ్రెంచ్ సైన్యం వారిని తరిమి కొట్టింది. ఇక అప్పటి నుండి ఫ్రెంచ్ సైన్యం సహాయం తో అక్కడ మాలి ఉగ్రవాదం తో పోరాడుతూనే ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: