వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పై సిట్ బృందానికి అనేక అనుమానాలు వస్తున్నాయి.. వాటిలో ఒకటి వైఎస్ రాజారెడ్డి హత్య కేసుతో సంభంధం ఉన్న సుధాకర్ రెడ్డి మరొక అనుమానం వివేకానంద రెడ్డి సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి. అయితే గత రెండు రోజులుగా పోలీసులకి పరమేశ్వర్ రెడ్డి పై అనుమానాలు వచ్చాయి. వైఎస్ వివేకానంద రెడ్డి తో ఆయనకి చాలా సంభందాలు ఉన్నాయని, వివేకా మృతి తరువాత నుండి ఆయన కనిపించకపోవడం పోలీసులకి అనుమానాన్ని కల్గించాయి. సరిగ్గా వివేకా చనిపోయే కొన్ని రోజుల ముందే వివేకా తో పరమేశ్వర్ రెడ్డి కి విభేదాలు వచ్చాయని ఇక తన అనుచరులతో పరమేశ్వర్ 10 రోజుల్లో బ్రేకింగ్ న్యూస్ వింటారని చెప్పినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇక అనుమానాలు వచ్చిన తరువాత నుండి పరమేశ్వర్ కొరకు పోలీసులు గాలిస్తున్నారు. కానీ పరమేశ్వర్ వారి కంట పడలేదు. అయితే తాజాగా నేడు ఉదయం ఒక ఆసుపత్రి లో మీడియా కంట పడిన పరమేశ్వర్ ఈ విషయం పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డితో తనకు 20 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని తప్ప… ప్రాణాలు తీసేవాడిని కాదన్నారు.
రాజకీయంగా తన కుటుంబాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. 30 ఏళ్లుగా కాపాడుకొంటూ వచ్చిన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. పోలీసుల అసమర్ధత వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తనది వివేకాది తండ్రి కొడుకుల లాంటి బంధం అని ఆయన అన్నారు. ఎప్పుడు తనని కొడుకులాగానే చూశాడని ఆయన కూడా వివేకాని తండ్రి ల భావించేవాడని ఆయన అన్నారు.
ఇక వివేకా మృతి చందిన సమయం లో ఆయన ఆసుపత్రి లో కదలలేని పరిస్థితులలో ఉన్నానని అందుకే పరమార్షించడానికి కూడా వెళ్లలేకపోయానని ఆయన అన్నారు.. అందుకు గాను ఆయన భార్య నీ మృతుదేహాన్ని పరమార్షించడానికై వెళ్ళమని కూడా చెప్పానని ఆయన అన్నారు.