దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి నేతలందరూ ప్రచారాల బరీ లోకి దిగారు. తమ పార్టీలకీయ వోటు వేయాలని ప్రజలని అడుగుతున్నారు దీనికి గాను వరుస సభలతో బిజీగా ఉన్నారు. ఇక తెలంగాణాలోను ఇదే పరిస్తితి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈసారి మల్కాజ్గిరి నుండి ఎన్నికల బరిలోకి డదిగనున్నారు. దీనికి గాను ఆయన సభలు నిర్వహించి ప్రజలని ఆకర్షిస్తున్నారు.. ప్రజలని ఆకర్షిస్తూనే ప్రతిపక్ష నేతలపై సెటైర్లు వేస్తూ తీవ్ర విమర్శలు చేస్తునారు. ఈ సంధర్భంగా మంగళవారం నాడు ఆయన మల్కాజ్గిరి లో పార్టీ కార్యాలయం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేసిఆర్ పై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కి దైర్యం ఉంటె మల్కాజ్గిరి నుండి పోటీచేయాలి అని ఆయన అన్నారు. నా పై పోటీకి రియలస్టర్లను, బ్రోకర్ లను నిలబెట్టాలని చూస్తున్నారు దమ్ముంటే కెసిఆర్ ఏ బరిలోకి దిగాలని ఆయన సవాల్ చేశారు. సబితా కుటుంబంకీ కాంగ్రెస్ ఎంతో చేసింది.. నన్ను పోటీచేయమని చెప్పి సబితా..టీఆరెస్ లోకి పోవడం న్యాయమా..? కేసీఆర్ బకాసురుడీలా.. ప్రతిపక్షాన్ని మింగేయాలనుకుంటున్నారు.. కౌరవులు నూరు.. పాండవులు ఐదుగురే.. గెలిచింది పాండవులే..! అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలని విసిరారు.
టీఆరెస్ నూరైనా.. పాండవుల్లాగా కాంగ్రెస్ దే గెలుపు. కల్వకుంట్ల కుటుంబం కూలిపోవాలంటే కార్యకర్తలు విల్లులు ఎక్కుపెట్టాలి.. సైన్యాధ్యక్ష్యుడిగా నేను ముందుండి పోరాడుతా.. నా మెడ తెగిపడే వరకు కేసీఆర్ తో పోరాడుతూనే ఉంటా.. అంటూ ఆయన కార్యకర్తలని కోరారు.
కేసీఆర్ కు రాజకీయంగా సమాధి కట్టేదే నేనే :
మల్కాజ్గిరిలోఉన్న నిరుద్యోగులు ఓట్లేస్తే చాలు.. రెండు లక్షలతో గెలుస్తా అని ఆయన అన్నారు. నా ఎన్నికలను పక్కనపెట్టి సుదీర్ రెడ్డికి ప్రచారం చేశా.. ఇదేనా నేను చేసిన పాపం.. నా ఇంటికొచ్చి మాల్కాజ్ గిరి లో పోటీచేయమన్నది సుధీర్ రెడ్డి కాదా .? నేను చెప్పింది నిజమని దేవుడి మీద వొట్టేస్తా..సుధీర్ వస్తాడా..? సుధీర్ రెడ్డి టీఆరెస్ లోకి ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలి..? కాంగ్రెస్ పుణ్యమని సుధీర్ రెడ్డి కి ప్రగతిభవన్ లో ధర పలికింది.. ప్రజలకోసం ప్రశ్నిస్తే నాపై ప్రభుత్వం వందల అక్రమకేసులు పెడుతుంది అని ఆయన అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కేసీఆర్ కీ రాజకీయంగా సమాధి కట్టేది నేనే అని ఆయన మండి పడ్డారు.