ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రాజకీయం రోజురోజుకి మరీ రసవత్తరంగా మారుతుంది. అధినేతలిద్దరూ బిజీ షెడ్యూల్ చేసుకొని ఒకర్ని మించి ఒకరు ప్రచారాలు చేస్తున్నారు. రోజుకి 3 సభలు పక్కాగా నిర్వహిస్తున్నారు. ప్రజలపై వారాల వర్షం కురిపిస్తున్నారు. నేతల రాకతో మరీ ఉత్సాహంగా ప్రచారల్లో పాల్గొంటున్నారు అక్కడి కార్యకర్తలు. ఇక చంద్రబాబు ఒక జిల్లాలో సభ నిర్వహిస్తే ఆయన కొడుకు లోకేశ్ మరో రాష్ట్రం లో సభ నిర్వహించేలా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఇక ఇదే రీతిలో వైసీపీ అధినేత జగన్ కూడా ఒక కొత్త ప్లాన్ వేశారు. జగన్ చెల్లలయిన వైఎస్ షర్మిళ ని వైఎస్ విజయమ్మ ని ప్రచార బరిలో దింపడానికి వ్యూహం సిద్దం చేశారు.
జగన్ ఒక చోట ప్రచారం చేస్తే షర్మిల మరో ప్రాంతం లో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే వైఎస్ షర్మిలా 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసింది. ఇక తన తండ్రి తరహాలో తన అన్న తరహాలో 2012 లో పాద యాత్ర కూడా చేసింది. ఆ సమయం లో తన డైలాగ్స్ తో తన ప్రసంగాలతో సభలతో పార్టీ వర్గాలని వైఎస్ అభిమానులని తన అభిమానులుగా మార్చుకుంది. ఇక తనకి మంచి గుర్తింపు నిర్గళంగా మాట్లాడే ప్రతిభ ఉండటంతో జగన్ ఆమెని ప్రచారం చేయమన్నట్టుగా కోరినట్టు తెలుస్తుంది. ఇక షర్మిలా కూడా రానున్న 27 వ తారికు నుండి ప్రచారం లో పాల్పంచుకొనుంది.
ఈ నెల 27 న ఆమె మంగళగిరి వేదికగా ప్రచారం మొదలు పెట్టనుంది. ఇక అక్కడనుండి దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నట్టు సమాచారం. ఇందుకు గాను పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. మంగళ గిరి తో మొదలుకొని శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురం వరకు ఆమె ప్రచారం సాగనుంది.
వైఎస్ విజయమ్మ కూడా వైసీపీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయించేలా వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. షర్మిళ, విజయమ్మ ప్రచారంతో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్నది ప్రతిపక్ష పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. వీరిద్దరి ప్రచారం కోసం రెండు బస్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.