నాగబాబు వస్తున్నాడు.. పోటీ చేస్తున్నాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చిరంజీవి తమ్ముడు.. ఒకప్పటి హీరో, నిర్మాత, బుల్లి తెరలో జరిగే కొన్ని షోల యజమాని నాగబాబు గత కొన్ని రోజులు గా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. పలువురు సినీ ప్రముఖులని, రాజకీయ నాయకులని టార్గెట్ చేసి వ్యంగ్యమైన వీడియోలు షార్ట్ ఫిల్మ్స్ తీసి వాటిని తన అకౌంట్ ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు. నటుడు బాలకృష్ణ ని టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా వీడియో లు అప్లోడ్ చేశాడు అవి కాస్త చాలా వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయం ఇలా ఉంటే తాజాగా ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ గురించి ఆయన వీడియోస్ పెడుతున్నాడు.. టీడీపీ వైసీపీ లని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు.. పవన్ కల్యాణ్ ని తన పార్టీ జనసేన ని ప్రమోట్ చేస్తున్నాడు. గతం లో కూడా ఆయన తన అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ప్రచారం లో పాల్గొన్నాడు.. ఆయన అన్న గెలుపుకి చేతనయిన సహాయం చేశాడు. అయితే ఇదే రీతిలో ఇప్పుడు తన సోదరుడు పవన్ కల్యాణ్ గురించి కూడా ఏదో ఒకటి చేయాలని భావించాడు.. ఇక విద్యోస్ తో మన ముందుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొన్ని రోజుల నుండి నాగబాబు జనసేన లోకి వస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఆయన బిహేవియర్ కూడా పార్టీలోకి వచ్చేట్టుగానే కనిపిస్తుంది. ఒక వేల పార్టీ లోకి వస్తే శాసన సభ కి తాను పోటీ చేస్తాడని వార్తలు వినిపించాయి. అయితే వచ్చిన వార్తలు నిజం అవుతున్నాయి ఆయన జనసేన పార్టీ లోకి వస్తున్నాడు. పార్టీలోకి రావతమే కాదు ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు కూడా.. శాసన సభ అభ్యర్థిగా ఆయన రంగం లోకి దిగనున్నాడు. మరి కొద్దిసేపట్లో ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షం లో ఆయన పార్టీ లోకి చేరానున్నాడు. నర్సాపురం నుండి లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నాడు. ఆయన గత కొన్ని రోజులుగా నర్సాపురం లో జనసేన పార్టీ గురించి పార్టీ కార్యక్రమాల గురించి పర్స్నల్ గా తెలుసుకుంటున్నారు కూడా.. అయితే ఆయన రాక వల్ల జనసేన పార్టీ లో పార్టీ అభ్యర్థుల్లో కొత్త జోష్ నిండుకుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: