ఆంధ్రప్రదేశ్ రాజాకీయాలు ఎండలకి మించి వేడెక్కాయి. నేతలు మెరుపు ప్రచారాలు చేస్తున్నారు.. రోజుకి మూడు నాలుగు సభలు అవి చాలక రోడ్ షో లు నిర్వహిస్తున్నారు.. ఒకరి పై ఒకరు బగ్గుమంటున్నారు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వీరు ఇలా ఉంటే పార్టీలకి మద్దత్తు పలుకుతున్న ప్రముఖులు ఎన్నికల బరీ లోకి దిగని నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రెస్ మీట్లు నిర్వహించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొన్న వైసీపీ నేత సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు.. అనుచిత వ్యాఖ్యలు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఇక ఆయన చంద్రబాబు ని ఆయన కులాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పై తాజాగా టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. దీంతో ఎన్నికల సంఘం గుర్రుమంది..! ఆయన చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చేస్తూ సంజాయిషీ చెప్పాలని ఎన్నికల సంఘం ఆయనకి సూచించింది. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనని లేఖ ద్వారా వివరణ ఇవ్వమంది.. ఇక ఈ విషయానికి స్పందిస్తూ పోసాని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.. నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు ముఖ్యంగా కులాన్ని ఎక్కడా ఉద్దేశించలేదు.. ప్రస్తుతం నేను తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్నాను నడవలేని స్థితి లో యశోదా హాస్పిటల్ లో ఉన్నాను ఆపరేషన్ చేయించుకోవాల్సిఉంది అని ఆయన ఎన్నికల సంఘానికి రాసిన లేఖ లో పేర్కొన్నారు.