దమ్ము లేక ఇలా అన్నాడా..? అనిపించాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు రాచుకున్న అగ్గిలాగా బగ్గుమంటుంది.. నేతలు ఎలాగైతే పోటీ పడి ప్రచారాలు సభలు నిర్వహిస్తున్నారో అలాగే పోటీ పడి ఒకరిపై ఒకరు దీటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే అధినేతలే సంచలనాలు సృష్టిస్తున్నారు అంకుంటే పార్టీ నేతలు మేమేమి తక్కువ తినలేదు అన్నట్టుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.. అధినేతలు బహిరంగ సభలు ఎంచుకుంటే.. రంగం లోకి దిగే నేతలు దిగకుండా కేవలం సపోర్ట్ చేస్తున్న నేతలు ప్రెస్ ఎం‌ఐటిన లని ఎంచుకొని సంచలనాలు చేస్తున్నారు. ఈ నేపధ్యం లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పై ఆయన కులం పై తీవ్ర విమర్శలు చేశారు.. దీనికి ప్రతి ఫలంగా ఆయనకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.. ఇక విజయవాడ వైసీపీ లోక్ సభ అభ్యర్థి వ్యాపార వేత్త పొట్లూరి వరప్రసాద్ నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుకున పడ్డాడు.

ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జరుగుతున్నా విషయాల గురించి వాళ్ళ పార్టీ అధినేత గురించి ఏదో చెప్పున్తే సరిపోయేది కానీ ఈయన ప్రత్యేక హోదా గురించి స్పందిస్తూ.. ప్రత్యేక హోదా పెద్ద బోరింగ్ సబ్జెక్ట్ అని ఆ టాపిక్ ని కొట్టి పారేశారు.. ఇక దీనికి గాను కొన్ని చానల్స్ ప్రత్యేక డిబేట్ లు కూడా పెట్టింది..! ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఎంతై అని అందరికీ అనుమానం వచ్చింది. ఇదేదో ఊరికే అనలేదని దీని వెనుక ఏదో కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న జగన్ పై విమర్శలు చేసే క్రమంలో ఆయన అనేక సార్లు జగన్ కేసీఆర్ మోదీ లు ఒక్కటి.. జగన్ తన కేసు నుండి తప్పించుకోడానికి మోదీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.. నిజానికి కూడా కొద్ది రోజులుగా జగన్ నోట మోదీ మాటనే రావడం లేదు.. తిరుపతి లో బహిరంగ సభ లో మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని అనడం సమాజానికి తెలిసిన వాస్తవం.. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా గురించి ఎంతగానో కష్టపడ్డారు.. అన్నీ తెలిసిన జగన్ ఒక్కసారి కూడా మోదీ గురించి ఎందుకు విమర్శించట్లేదు..? జగన్ నోట మోదీ మాట ఎందుకు రావట్లేదాని అందరూ అనుకుంటున్నారు.

ఇక పోతే చంద్రబాబు జగన్ కి మోదీ ని నిలదీసే దమ్ము లేదు.. జగన్ అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా గురించి మోదీ ని నిలదీయ లేరు అని కూడా అన్నారు.. మరి జగన్ కి నిజంగానే మోదిని నిలదీసే దమ్ము లేదా అనెట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ జగన్ కి నిజంగానే ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక శ్రేద్ధ ఉంటే ఇన్ని సభల్లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించట్లేదు..? నిలదీసే దమ్ములేకనే ఇప్పుడు తన అభ్యర్థి తో అలా అనిపించార జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని డైవెర్ట్ చేసే పనిలో ఉన్నారా అని అనిపిస్తుంది. ఇక ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే జగన్ నిజంగానే కే‌సి‌ఆర్ మోదీ ల పక్షాన చెరీ ఏపీ లో రాజకీయాలు చేస్తునట్టుగానే కనిప్సితుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: