ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. నేతలు నామినేషన్ వేయడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో నామినేషన్ల విషయం లో కూడా పోటీ పడుతున్నారు. ఈ సంధర్భంగా టీడీపీ అధినేత తరఫున ఆయన భార్య నామినేషన్ వేయనున్నారు ఇక్ ప్రతిపాక్ష నేత జగన్ కూడా మరి కొంత సేపట్లో నామినేషన్ వేయబోతున్నారు.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ మొదటి సారిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనున్నారు.. మంగళగిరి నియోజకవర్గం నుండి ఆయన భరిలోకి దిగనున్నారు.. ఈమేరకు ఇప్పటికే మంగళగిరి తారా స్థాయిలో ప్రచారం కూడా చేసేశారు.. అలుపు లేకుండా అక్కడ ప్రచారం లో ఆయన పాల్గొన్నారు.. దాదాపుగా అన్నీ మతాల వారిని ఆయన్ కలిశారు.. గెలుపు భాత లో ఆయన పయనిస్తున్నారు.
ఇక ఆయన కూడా నేడే నామినేషన్ పత్రాలని దాఖలు చేయడానికి ఈరోజే ముహూర్తం పెట్టుకున్నారు. ఈ కారణంగా ఉండవల్లి లోని ఆయన నివాసం లో తల్లి దంరులని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పూజారులతో పూజలు చేయించుకొని వారి ఆశీర్వాదం తీసుకొని ఆయన అక్కడ నుంచి బయలుదేరారు. ఇక మంగళగిరి తహశీల్దార్ ఆఫీసులో ఆయన నామినేషన్ పత్రాలని ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు.