ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి ఈ నేపధ్యం లో పార్టీ నేతలు అధినేతలు నామినేషన్లకై పరుగులు తీస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రధాన పార్టీ అధినేతలు నామినేషన్లు వేయబోతున్నారు. దీంతో అందరిన్ కళ్ళు ఇప్పుడు నామినేషన్ల పైనే పడింది.. ఈ నేపధ్యం లో ఇప్పటికే నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం బయలుదేరింది.. ఇక మరి కొంత సేపటిలో జగన్ పులివెందులలో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు.. ఇక జనేసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుండి అసెంబ్లీ కి పోటీ చేయబోతున్నాడు.. భీమవరం గాజువాక స్థానాల నుండి ఆయన పోటీకి దిగనున్నారు. ఈ సంధర్భంగా నిన్న గాజువాక లో ఆయన నామినేషన్ పత్రాలని ఎన్నికల అధికారికి అందజేశారు. ఇక పోతే ఇవాళ మద్యాహ్నం 1.30 గంటల ప్రాంతానికి ఆయన భీమవరం స్థానానికై నామినేషన్ వేయనున్నారు. ఈపాటికే ఆయన భీమవరం చేరుకున్నారు.. ఇక 1.30 గంటలకి భీమవరం మండల్ ఆఫీస్ లో ఆయన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడ బహిరంగ సభ లో ఆయన పాల్గొనబోతున్నారు. పవన్ కల్యాణ్ రాక తో భీమవరం అంతా సందడి నెలకొంది.. భారీ ఎత్తున ప్రజలు అభిమానులు జనసైనికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం నామినేషన్..!
Share.