జనసేనాని నేటి కార్యక్రమాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేనాని పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నాడని తెలిసిందే.. అయితే ఈ సంధర్భంగా నిన్న గాజువాక లో ఆయన నామినేషన్ పత్రాలని ఎన్నికల అధికారికి అందజేశారు. ఇక పోతే ఇవాళ మద్యాహ్నం 1.30 గంటల ప్రాంతానికి ఆయన భీమవరం స్థానానికై నామినేషన్ వేయనున్నారు. ఈపాటికే ఆయన భీమవరం చేరుకున్నారు.. ఇక 1.30 గంటలకి భీమవరం మండల్ ఆఫీస్ లో ఆయన నామినేషన్ వేయనున్నారు.

నామినేషన్ ప్రక్రియ అనంతరం ఆయన భీమవరం లో నేడు ప్రచారం చేయబోతున్నారు. నామినేషన్ పూర్తయిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకి భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్ లో జరగబోయే సభ లో ఆయన పాల్గొంటారు. అక్కడి ప్రజలతో కార్యకర్తలతో ఆయన మాట్లాడతారు. ఆతరువాత 3 గంటల ప్రాంతానికి నిడమర్రు ఉంగుటూర్ చేరుకుంటారు అక్కడ స్టేట్ బ్యాంక్ పక్కన్ ఉన్న గ్రౌండ్ లో జరగబోయే సభ లో పాల్గొంటారు.. ఇక అక్కడ నుండి సాయంత్రం నాలుగు గంటలకి ఏలూరు చేరుకొని అక్కడి అల్లూరి సీతారామరాజు స్టేడియం లో జరగబోయే సభ కి ఆయన హాజరవుతారు.. అక్కడ కార్యకర్తలతో ప్రజలతో ఆయన మాట్లాడతారు.. ఇది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి షెడ్యూల్.

Share.

Comments are closed.

%d bloggers like this: