ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు బగబగ మండుతున్నాయి. డబ్బు ఉంటేనే రాజకీయం డబ్బు ఉన్నవారికే ఎన్నికల టికెట్ అన్నట్టుగా మారాయి అక్కడి పరిస్తుతులు.. వైసీపీ అభ్యర్థులని చూసినా టీడీపీ అభ్యర్థులని చూసినా అందరూ వందల కోట్ల అధిపతులే.. లోక్‌సభ అభ్యర్థులైతే చెప్పనక్కర్లేదు.. తాజాగా వారి ఆస్తి వివరాలు బయటకొచ్చాయి.. అయితే ఇక్కడ కూడా ఒకరి తో ఒకరు పోటీ పడుతున్నారు ఒకరొచ్చి నా దేగ్గర 100 కోట్లు ఉన్నాయంటే మరొకరు నాదేగ్గర 200 అన్నటుగా వీరి పోటీ ఉంది. తాజాగా విడుదలైన ఆస్తి వివారాలలో నర్సీపట్నం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణంరాజు నటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఆస్తుల్లో పోటీ పడుతున్నారు.
నర్సిపట్నం అభ్యర్థి ఆస్తుల విలువ 300 కోట్లకి పై మాటే.. వారికి వచ్చే రుణాల విలువే 110 కోట్లు వీరి విషయం ఇలా ఉండగా.. శ్రీ భరత్ ఆయన భార్య తేజస్విని ఇద్దరి ఆస్తుల విలువ 250 కోట్లకి పై మాటే..! భరత్ 2014-15 వార్షికాదాయం రూ.5 లక్షలు కాగా.. 2018-19 నాటికి ఆయన వార్షికాదాయం రూ.23 లక్షలకు చేరింది. ఆయన భార్య తేజస్విని వార్షికాదాయం 2014-15లో రూ.10 లక్షలు ఉండగా.. 2018-19 నాటికి అది రూ.57 లక్షలకు చేరింది. భరత్‌కు గుర్గావ్లో ఫామ్ హౌస్ సహా రూ.190 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట రూ.27 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
సిద్దేశ్వర్ పవర్ జనరేషన్, వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, నేచురల్ శాండ్స్, బసిల్ ఇన్ఫ్రా.. తదితర సంస్థల్లో భరత్ రూ.5.52 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఆయన భార్య తేజస్వినికి మెడ్విన్లో కంపెనీలున్నాయి. ఆమె దగ్గర ఉన్న బంగారం, వెండి, వజ్రాభరణాలు, బ్యాంకు డిపాజిట్ల విలువ రూ.7.26 కోట్లు. ఇలా మొత్తం కలిపి దాదాపుగా వీరి ఆస్తి విలువ 250 కోట్లకు పైమాటే.