‘తలైవి’..లో ‘జయ’గా కంగనా రనౌత్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, అమ్మా గా తమిళనాడులోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహిళ.. ఐదు సార్లు సీఎం సీటుని అధిరోహించిన నేత 1991 నుండి 2016 వరకు సీఎం గా కొనసాగిన నేత..ఇక పేరు చెప్పకుండానే అందరి మదిలో కనిపించే పేరుతో పరిచయం అవసరం లేని వ్యక్తి జయలలితా..! ఈమె చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానాలు దేశానికే ఆదర్శం. దేశ వ్యాప్తంగా భారీగా ప్రజాదరణ కలిగిన మహిళగా ఈమెకి ప్రత్యేఖ గుర్తింపు కూడా ఉంది. ఇక ఈమె జీవిత కథ ఆదారంగా బయోపిక్ లు తీస్తున్నారు.. ఆ బయోపిక్ లు తీసే దర్శకుల్లో ఒకరే ఏఎల్ విజయ్. ఏఎల్ విజయ్ ఈమె జీవితాన్ని గురించి ఎంతగానో రీసర్చ్ చేసి స్పెషల్ గా స్టడీ చేసి కథని సిద్ధం చేసుకున్నారు. ఇక విష్ణు ఇందూరు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాకి గాను తలైవా అనే టైటిల్ ని ఖరారు చేశారు ఇక కథ స్క్రిప్టు అద్భుతంగా ఉండటం తో ఈ సినిమాను హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక హిందీ లో ఈ సినిమా కి జయ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో జయా పాత్రకి తగ్గ నటి గురించి వెతుకుతుంటే అటు హిందీ లో ఇటు సౌత్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు ఉన్న నటి కావాలి, ఇక కంగనా రనౌత్ మనసులో రాగానే ఆమెని అడగారు. కథ చెప్పకుండా పేరు చెప్పగానే ఆమె ఒకే చెప్పేసిందట.. ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిందట.. ఎక్సైట్ మెంట్ కంటే ఎక్కువగా బాధ్యతను ఫీల్ అయ్యానని చెప్పారు. పురుషాధిపత్యం ఉండే సమాజంలో తన స్థానం కోసం పోరాడిన ఓ గొప్ప యోధురాలి చరిత్ర ఇది అని తెలిపారు. ఎంతో నిజాయతీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉందని చెప్పారు. . ఈ రోజు కంగనా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం లో ఆమె నటిస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: