కేవలం ఓట్లు రాబట్టుకోడానికి విమర్శలు చేస్తున్నాడు..పోసాని..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత రెండు రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేస్తున్నారు.. తాను తెలంగాణ లో సభ ఏర్పాటు చేస్తే తన సభలోకి దూరి తననే కొట్టడానికి టి‌ఆర్‌ఎస్ నేతలు పాల్పడ్డారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ నేతలు ఆంధ్ర నేతలపై దాడులకి పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. ఇక ఆ ఆరోపణల పై వైసీపీ నేత ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.. పవన్ అనవసరంగా తెలుగు ప్రజల మద్య ఇరు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టె ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన పవన్ కళ్యాణ్ పై గుర్రుమన్నాడు.

పవన్ అన్నట్టుగా తెలంగాణలో దెబ్బలు తిని ఆంధ్రకి పారిపోయిన నేతలనీ చూపించాలంటు ఆయన డిమాండ్ చేశారు. ఓట్లు రాబట్టుకోవడం కోసం పవన్ హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లను ఎవరు కొట్టారు? ఎవరు ఆంధ్రాకు పారిపోయారో రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. నేను కూడా తెలంగాణ ఉద్యమం సమయం లో కేసీఆర్ కి వ్యతిరేకంగా కధనాలు రాశాను మరి అప్పుడు నన్ను ఎవ్వరూ కొట్టలేడీ అని ప్రశ్నించాడు.. ఒకవేళ పవన్ అంటునట్టుగా నిజంగానే అలా కొట్టేవాళ్లని చూపించమనండి నేను కూడా ఆంధ్రకి పారిపోతా అని ఆయన అన్నారు. గతం లో కేసీఆర్ ని చూసి ఆంధ్ర నేతలు బుద్ధి తెచ్చుకోవాలని ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని అన్న ఆయన ఇప్పుడేందుకు మాట మారుస్తున్నదని పోసాని ప్రశ్నించాడు.. ఎన్నికలకీ ముందు ఒక మాట మార్చాల్సిన అవసరం ఏం ఉందని పోసాని పవన్ ని ప్రశ్నించాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: