ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి అధినేతలు సభలతో బిజీగా ఉంటున్నారు. సభల్లో అధినేతలు ప్రజలకి వారాలు కురిపిస్తున్నారు అలాగే ప్రతిపక్షాల పై మాటల తుటాలు పేలుస్తున్నారు. ఈ క్రమం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్ పై జగన్ పై విమర్శలు చేశాడు. తోలు తీస్తా అనే పదాన్ని వాడారు. ఇక దీని పై సినీ నటుడు వైసీపీ నేత పృధ్వీ ఫైర్ అయ్యాడు. ఎన్నికల ప్రచారంలో తొక్క తీస్తా.. తోలు తీస్తాననే పవన్.. ముందు చంద్రబాబు, లోకేష్‌ల తొక్క, తోలు తీయాలన్నారు. ఈ ఐదేళ్లలో అవినీతి చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన బాబు తోలు తీయాలన్నారు.
ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడని, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షడు పవన్ అంటూ విరుచుకుపడ్డారు. విశాఖలో మాట్లాడిన పృథ్వీ జగన్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావు.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా?.. ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు’ అన్నారు పృథ్వీ.
‘2014 ఎన్నికల్లో టీడీపీని బంగారు సైకిల్.. చంద్రబాబుని నీతిమంతుడని పొగిడి టీడీపీకి ఓట్లు వేయించావు.. మళ్లీ ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని కష్టాలు పడుతున్నావ్.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మీ ఇద్దరికీ చరమగీతం పాడటం’ఖాయమన్నారు. నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఓటు కూడా ఏ తేదీన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్క మాటైనా అన్నావా పవన్..? నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతోపాటు నీ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారు’అన్నారు.