ఫ్యాన్ కి ఉరేసుకుంటే ఒక్కరే పోతారు.. ఓటేస్తే అందరం పోతాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ పార్టీ లోకి ఇటీవలే చేరిన దివ్యవాణి తన మాటలతో విమర్శలతో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయింది. గత కొంతకాలంగా పార్టీ కి ఏది ప్రతికూలంగా వచ్చిన దివ్యవాని తన స్పందనని తెలియజేస్తూ యాక్టివ్ గా కనిపిస్తుంది. ఛాన్స్ దొరికినపుడల్లా ప్రతిపక్షాల పై తిరగబడుతుంది. విమర్శలు వ్యంగ్యాస్త్రాలు వేస్తుంది. ఇక తాజాగా ఫ్రే మీట్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ని తెలంగాణ సీఎం కే‌సి‌ఆర్ ని ఏకీపారేసింది. ఈమాద్యే తిరుపతిలో మోహన్ బాబు ఫీజు బకాయిలు వెంటనే తీర్వాలి అంటూ నిరసన చేశారు. ఇక దాని పై స్పందిస్తూ తిరుపతిలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ అంటూ మోహన్ బాబుతో డ్రామా ఆడించింది కేసీఆరేనంటూ ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు లాగేసుకుంటామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జులుం ఆంధ్ర పై ఏంటి అని ఆమె ప్రశ్నించింది. కేసీఆర్ ఆంధ్ర నాయకులని బెదిరిస్తున్నారని హైదరబాద్ లో వల్ల ఆస్తులని లాగేసుకుంటానని కేసీఆర్ బెదిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇదే తరహా లో సినీ నటుడు అలీ ని కూడా కేసీఆర్ బెదిరించి ఉంటారని అందుకే అలీ తన ప్రాణ స్నేహితుడైయన్ పవన్ పార్టీ లో చేరకుండా జగన్ పార్టీ లో చేరారని ఆమె ఆరోపించింది.

ఇక వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల పై ఆమె ద్వాజమెత్తింది. తన అన్న పై ఉన్న కేసులని మాఫీ చేయించడానికే షర్మిల మళ్ళీ రాజకీయాల్లోకి వస్తుందని ఆమె ఆరోపించారు. షర్మిలా అభివృద్ది ఎక్కడ జరగలేదని అన్నారు ఒక్కసారి అమరావతికి వచ్చి చూస్తే కనపడుతుంది అభివృద్ది ఎలా ఉంటుందో.. ఇక్కడ అభివృద్ది చూస్తే షర్మిలా కూడా టీడీపీ కె ఓటు వేస్తుందని ఆమె వ్యంగ్యంగా విమర్శలు చేసింది. ఫ్యాన్ గుర్తుని నమ్మోదని ఫ్యాన్ కి ఉరేసుకుంటే ఒక్కరే పోతారు ఫ్యాన్ కి ఓటేస్తే అందరూ పోతారు అంటూ ప్రజలకి మనవి చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: