మరికొద్ది సేపట్లో.. మంచు మోహన్ బాబు ఇన్ వైసీపీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ప్రభుత్వానికి వెతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఫీజు బకాయిల విషయం లో చంద్రబాబు సరిగ్గా స్పందించట్లేదాని ముందు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. కానీ అప్పటికీ చంద్రబాబు ఎటువంటి చర్య చేపట్టట్లేదని మొన్న తిరుపతిలో ఆయన కొడుకులతో కలిసి నిరసనకి దిగారు.. ఇక ఈ విషయం ఇలా ఉండగా టీడీపీ కి వ్యతిరేక పార్టీ వైసీపీ కండువా కప్పుకుంటే కాస్త మద్దత్తు చేకూరుతుందని ఆయన భావించినట్టు ఉన్నారు. ఇందుకు గాను వైసీపీ అధినేత జగన్ ని సోమవారం ఉదయం మోహన్ బాబు హైదరబాద్ లోని లోటస్ పాండ్ లో కలవనున్నారు. జగన్ తో ఈ విషయమై కొంత సేపు భేటీ కానున్నారు. భేటీ అననతరం వైసీపీ అధినేత జగన్ సమక్షం లో ఆయన పార్టీ లోకి రానున్నారు.

జగన్ తో కేవలం భేటీలోనే పాల్గొంటున్నారా లేక పార్టీలోకి చేరుతున్నారా అనే విషయం లో మరి కొంత సేపట్లో క్లారిటీ రానుంది. ఈ విషయం ఇలా ఉంటే మోహన్ బాబు కి వైఎస్ కుటుంబం తో మంచి మిత్రుత్వం కూడా ఉంది. మిత్రుత్వమే కాకుండా తన పెద్ద కొడుకు విష్ణు భార్య తో వైఎస్ కుటుంబానికి చుట్టరీకం కూడా ఉంది. ఇక ఈ మిత్రుత్వం చుట్టరికం ఆయనని పార్టీలోకి వేలెట్టుగా చేస్తాయో తెలియాలంటే వేచి చూడాలి. ఇటీవలే మంచి విష్ణు కూడా వైసీపీ కి మద్దత్తు తెలుపుతూ టీడీపీ పార్టీ పై విమర్శలు చేశారు. ఇక ఆయన భార్య కూడా తన ట్విట్టర్ ద్వారా తనకి జగనన్న అంటే ఎంటూ ఇష్టమని పేర్కొంది.

Share.

Comments are closed.

%d bloggers like this: