కేసీఆర్ సమాధానం చెప్పాలి..! కోర్టు నోటీసులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నామినేషన్ వేసే చివరి తేదీ చివరి గడువు నిన్నటితో పూర్తయ్యింది కానీ నామినేషన్ లపై వచ్చిన గందరగోళాలు ఇప్పటికీ చెక్కర్లు కొడుతున్నాయి. నిన్న ఉదయం నిజామాబాద్ ఎంపీ కవిత పై 250 మంది నామినేషన్లు వేసి హల్‌చల్ చేశారు. ఇక నిన్న సాయంత్రం కె ఏ పాల్ నామినేషన్ గడువు ముగిసాక వెళ్ళి వార్తల్లోకి వచ్చారు ఇక ఇప్పుడు ఈ గందరగోళాల లిస్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరారు.. గజ్వేల్ లో గెలిచిన కేసీఆర్ 2018 ఎన్నికల నిబంధనలు అతిక్రమించాడని.. నామినేషన్ దాఖలు ముందు ఇచ్చే అఫిడేవిట్ లో కేసీఆర్ తప్పుడు వివరాలు ఇచ్చాడని ఆయన పై ఒక ఓటరు పిటిషన్ వేశారు. ఇప్పుడు కోర్టు కేసీఆర్ కి ఆ నామినేషన్ ని దృవీకరించిన రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. కేసీఆర్ 2018 ఎన్నికల్లో కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్‌పై వివరణ కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసీఆర్‌పై ఈ పిటిషన్ దాఖలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్‌లో ఆరోపించారు. ఆయనపై 64 కేసులు ఉంటే కేవలం 4 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపించారని అందులో పేర్కొన్నారు. ఇక తప్పుడు వివరాలు ఇచ్చినందుకు కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని ఆయన కోర్టును అప్పీల్ చేశాడు. ఇక దీనికి స్పందిస్తూ కోర్టు కేసీఆర్ కి ఎన్నికల అధికారికి వెంటనే సమాధానం చెప్పాలని వారికి 4 రోజుల గడువునిస్తూ నోటీసులు జారీ చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: