ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు టైర్లాకి పంచర్ పడింది. మార్చి 22 న పోలింగ్ జరగగా నేడు కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానం లో నిలిచింది. ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చిటూగా ఓడింది ఇక పరువు కాపాడుకునే దిశలో వారికి ఇప్పుడు విజయం దక్కింది.ఎంత అగ్రనేతలు క్యాంపెయిన్ చేసినా టీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం గమనార్హం.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. సీపీఎం బలపరిచిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 18,885 ఓట్లు పోలవ్వగా, నర్సిరెడ్డికి 8,976 ఓట్లు.. పూల రవీందర్‌కు 6,279 ఓట్లు పోలయ్యాయి. రవీందర్‌కు టీఆర్ఎస్ మద్ధతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్, వామపక్షాలు మద్ధతుగా నిలిచాయి.
ఇక మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్‌పై ఆయన 39,430 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
పోటీలో మొత్తం 17 మంది నిలవగా.. మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. చంద్రశేఖర్‌కు 17,268 ఓట్లు రాగా, బీజేపీ బలపరిచిన సుగుణాకర్‌రావుకు 15,077 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు.