సినిమా రిలీజ్ చేయొద్దు.. హై కోర్ట్ నోటీసులు జారీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుని విలన్ గా చూపిస్తూ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితం లో లక్ష్మి పార్వతి వచ్చిన తరువాత నుండి జరిగిన ఘట్టాలని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నెగిటివ్ గా చూపిస్తూ తీశానని వర్మ ఎన్నోసార్లు చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే సినిమా ట్రైలర్స్ లో కూడా కనపడుతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటినుండి టీడీపీ నేతలు ఈ సినిమా ని రిలీజ్ కాకుండా ఎన్నో విశ్వప్రయత్నాలు చేశారు.. ఎన్నికల కమిషన్ కి ఈ సినిమా నిలిపివేయాలని టీడీపీ నేతలు కోరారు తరువాత సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి అడ్డు పడింది.. ఇలా ఎన్నో వివాదాలు ఈ సినిమా ఈపాటికే చూసేసింది. ఇక రిలీజ్ అవ్వకముందే ఇన్ని వివాదాలని చూసిన సినిమా రిలీజ్ అయ్యకా ఎన్ని చూస్తుందో అని అందరూ అనుకుంటున్నారు.

ఇక ఈ విషయం ఇలా ఉంటే టీడీపీ నేతలు పెట్టిన ఒక్కో చిక్కుని తీసుకుంటూ వర్మ కోర్టుకెక్కి ఎంతో కష్టపడ్డాడు.. ఇక ఆయన ప్రయత్నాల ఫలితంగా ఈ సినిమా ని ఆపడానికి వీళ్ళేదంటూ ఎన్నికల కమిషన్ సినిమా ని రిలీజ్ చేయొచ్చు అంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశాలని ఇచ్చేశాయి.. ఇక ఈ చిత్రా యూనిట్ అన్నీ ఎదుర్కొని ఫైనల్ గా శుక్రవారం నాడు 29 న ఈ సినిమాని విడుదల చేయాలని నిశ్చ్యించుకున్నారు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసేశారు.. ఇక రేపు రిలీజ్ అవ్వడానికి ఈ సినిమా సిద్దం అయ్యింది ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమా టికెట్ ఫుల్ అయిపోయాయి కూడా..!

అంతా బాగుందనుకునే సరికి మరో పెద్ద చిక్కు వచ్చి పడింది.. ఈసారి హై కోర్ట్ అడ్డుపడింది సినిమా రిలీజ్ చేయడానికి వీళ్ళేదని ఆదేశాలు జారీ చేసెసింది. వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ… పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది. అంతేకాదు 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మీడియాల్లో కూడా సినిమాను ప్రదర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: