డివిలియర్‌స్ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఐపీఎల్ 12 లో 7 వ మ్యాచ్ ముంబయి ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం లు తలపడనున్నాయి. బెంగళూరు ముంబయి ఇరు టీం లు ఇప్పటికే ఆడిన ఒక్కో మ్యాచ్ ఓడిపోయారు. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో చెన్నై బెంగళూరు తలపడ్డాయి.. ఆ మ్యాచ్ లో బెంగళూరు అతి పేలవంగా ఓడిపోయింది బ్యాటింగ్ ఆదర్ దారుణంగా విఫలమయ్యింది కేవలం 70 పరుగులకే టిమ్ ప్యాకప్ అయిపోయింది చెన్నై ఆ మ్యాచ్ విజేతగా నిలిచింది. ఇక ఈ విషయం ఇలా ఉంటే ముంబయి ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తల పడి పంత్ పవర్ తాకిడికి ఎదురు నిలవలేకపోయింది. అలా ముంబయి ఓటమి పాలయ్యింది.

ఇక ఇరు టీం లు మొదటి మ్యాచ్ లు ఓడిపోయి నేడు ఒకరి పై ఒకరు తలపడనున్నారు.. కాగా మ్యాచ్ ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇరు టీం లు కూడా మొదటి మ్యాచ్ లో విఫలమయ్యేసరికి ఈ మ్యాచ్ ని పార్టీష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.. ఈ మ్యాచ్ ని ఎలాగైనా గెలవాలని మంచి కసిమిద ఉన్నాయి.. ఇప్పటికే కోహిలీ సేన రోహిత్ సేన మ్యాచ్ కి సిద్ధం అయ్యాయి. కాగా మ్యాచ్ కి కొన్ని గంటల ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆర్‌సీబీ విద్వంసకర బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ బౌలర్లకి కి కాస్త కష్టంగానే ఉండబోతుంది అని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చారు. ఇక బూమ్రా గురించి ఆయనని ఎలా ఎదుర్కొబోతున్నారు అని అడిగితే.. జస్‌ప్రీత్ బుమ్రా చాలా మంచి బౌలర్. కానీ.. అతడ్ని కూడా ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలూ లేకపోలేదు. అలా అని ప్రతి మ్యాచ్‌లోనూ అతని బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవచ్చు కానీ.. బలాలు, బలహీనతలు ప్రత్యర్థికి తెలిసిపోయిన తర్వాత ఎవరూ పర్‌ఫెక్ట్‌గా కాదు అంటూ ఆయన బదులిచ్చారు. ఇక ఈయన మాటలు చూస్తుంటే మ్యాచ్ ఈరోజు ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం అవుతుంది.

de villiers and kohli

Share.

Comments are closed.

%d bloggers like this: