ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు ఆకాశానికి చేరుకుంటుంది.. నేతలంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారాలు చేస్తున్నారు. మరి కొందరు వేరే జిల్లాలకి కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు.. ఇక పార్టీ అధినేతలు స్టార్ కేంపెయినర్లు జిల్లాల వారీగా రాష్ట్రమంతా సంగం పైనే చుట్టేశారు.. ఇక ఈ విషయం ఇలా ఉంటే టీడీపీ అభ్యర్థి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ప్రచారానికి వెళ్లారు.. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయనకి బారి ప్రజాదరణ లభిస్తుంది నేతలంతా కార్యకరతలంతా వంశీ వెంబడే ఉంటున్నారు.. ఆయన తోనే నడుస్తున్నారు.
ఈక్రమంలో కొత్త కార్యకర్తలు నేతలు కూడా ఆయన సమక్షం లో పార్టీ లోకి వస్తున్నారు పార్టీ కండువా కప్పుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. తాజాగా ఆయన గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంలో ప్రచారానికి వెళ్లారు అక్కడ ఆయనకి ఒక మంచి అనుభవం ఎదురైంది. కార్యకర్తలంతా వంశీ రాగానే ఆయనకి జేజేలు పలికారు.. గ్రామ సభ్యులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు.
ఆయన గ్రామం లోకి రాగానే సాదారంగా ఆహ్వానించిన గ్రామస్తులు ఆయన పై పూల వర్షం కురిపించారు.. ఆయన ముందే ఆయన ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఆయన రాక గురించి ఎదురుచూస్తున్న గ్రామస్తులు ఆయన రాగానే ఆయన సమక్షం లో పార్టీలోకి చేరారు.. దాదాపుగా 245 మంది నేతలు ఆయన సమక్షం లో పార్టీలోకి చేరారు. ఈ ఎన్నికల్లో వంశీకి భారీ విజయం భారీ మెజారిటీ రావడం తప్పక మానదు అని వంశీ అనుచరులు అంటున్నారు. ఇక అప్పుడే ఆయన పై లక్షల కొద్ది బెట్టింగులు మొదలు పెట్టేశారని సమాచారం.