అమిత్ షా నామినేషన్..! చర్చనీయాంశం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు గాంధీనగర్ పార్లిమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. గత ఆరు దఫాలుగా గాంధీనగర్ పార్లమెంట్ నుండి బీజేపీ సీనియర్ నేత పార్టీ స్థాపన నుండి పార్టీ కొరకు కృషి చేసి పార్టీకి తోడుంటూ శాయశక్తులా కష్టపడ్డ ఎల్కే అద్వానీ అక్కడ నుండి పోటీ చేస్తున్నారు. అలాంటి సీనియర్ నేత స్థానం లో నేడు అమిత్ షా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సీనియర్ నేత అద్వానీ ని పక్కన పెట్టి ఆయన నామినేషన్ వేశారు ఇక ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.

అమిత్ షా నామినేషన్ కి బీజేపీ నేతలు అనూహ్య మద్దత్తు తెలిపారు. ఆయన గాంధీనగర్ లో నామినేషన్ పత్రాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇస్తున్న సమయం లో పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు నేతలు ఆయనకి మద్దత్తు తెలుపుతూ నామినేషన్ ప్రక్రియ కి హాజరయ్యారు. అయితే అమిత్ షా నామినేషన్ కి ముందు ఆయనకి మద్దత్తుగా నిర్వహించిన ర్యాలీ లో పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ వామ పక్షాలు శివసేన మరికొన్ని ఇతర పార్టీలు ర్యాలీ కి హాజరయ్యాయి. ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది. అయితే నామినేషన్ కి గాని అమిత్ షా నిర్వహించిన ర్యాలీకి గాని సీనియర్ నేత అద్వానీ కి ఆహ్వానం వచ్చినప్పటికీ ఆయన పాల్గొనలేదు.

నామినేషన్ ముగించిన తరువాతా అమిత్ షా మాట్లాడుతూ అటల్ బీహార్ వాజ్‌పేయి, అద్వానీ వంటి సీనియర్ నేతలు పోటీ చేసిన ఈ గొప్ప నియోజకవర్గం గాంధీనగర్ నుండి బరిలోకి దిగడం సంతోషంగా ఉంది. ‘దేశాన్ని ఎవరు నడిపించాలనే అంశం మీదే ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ నుంచి కన్యాకుమారి వరకు కామ్‌రూప్ నుంచి గాంధీనగర్ వరకు అందరినీ అడిగా. అందరూ ఒకే పేరు చెబుతున్నారు. ఆ పేరు.. మోదీ’. అని అమిత్ షా అన్నారు. బీజేపీ వల్లే తాను ఇక్కడ ఉన్నానని, పార్టీ లేకపోతే తాను లేనని అమిత్ షా ప్రకటించారు. ర్యాలీకి హాజరయిన వామపక్షాలు శివసేన నేతలు మాట్లాడుతూ.. హిందుత్వ ని కాపాడేది మోదీ.. మోదీ తరువాతా పార్టీలో శక్తి వంతమైన వ్యక్తి అమిత్ షా అని కొనియాడారు.

Share.

Comments are closed.

%d bloggers like this: