ఓనమాలు రావు కానీ అగ్ర తాంబూలం కావాలంట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిలా నేడు గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం లో పాల్గొన్న ఆమె నారా లోకేశ్ నే ముఖి టార్గెట్ గా చేసి విమర్శలు చేశారు వ్యంగ్యంగా లోకేశ్ ని పప్పూ అంటూ తీసిపారేశారు.

ఆమె మాట్లాడుతూ లోకేశ్ ని పప్పు అని అభివర్ణించారు..! మన పప్పుగారికి జయంతికి వర్దంతి కి కూడా తెలియదని ఆమె అన్నారు. కనీసం అ ఆ లు కూడా ఆయనకి రావని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అ ఆ లు కూడా రాణి ఒకడికి అగ్రతాంబూలం కావాలంటా అంటూ లోకేశ్ ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సందించారు.

బాబు వస్తే జాబు వస్తది అని చంద్రబాబు అన్నారు కానీ ఎవ్వరికీ జాబులు లేవు..! కనీసం జాబు నోటిఫికేషన్లు కూడా పడటం లేదు అని ఆమె అన్నారు. బాబు వచ్చాడు కానీ జాబు ఎవ్వరికొచ్చింది అంటూ అక్కడున్న జనాన్ని ప్రశ్నించారు. బాబు వచ్చారు జాబు వచ్చింది కానీ ఎవ్వరికీ.. ఆయన కొడుకుకి వచ్చింది.. అది కూడా ఒకటి రెండు కాదు మొత్తం మూడు జాబులు వచ్చాయి. మూడు శాఖలకు మంత్రి పధవి వచ్చింది అని ఆమె విమర్శలు చేశారు.

ఓనమాలు రాణి వ్యక్తికి మూడు జాబులు ఇక్కహ్దు అంటూ ఆమె చంద్రబాబు పై మంది పడింది. ఒక్క ఎనికలో కూడా గెలవని లోకేశ్ కి అసలు మంత్రి పధవి ఎల్లా ఇస్తారు అని ప్రశ్నించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేశ్ కి మూడు పధవులు ఎలా వచ్చాయి అని ఆమె ప్రశ్నించారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా అంటూ ప్రశ్నించారు. సీఎం కొడుకుకు మూడు జాబులు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లేవని కనీసం నోటిఫికేషన్లు కూడా లేవన్నారు. ఇలాంటి సీఎం మనకి అవసరమా..? అంటూ ఆమె అక్కడ ఉన్న జనాన్ని ప్రశ్నించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: