ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుంది. ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తుంగా వాహనం నుంచి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పవన్ కల్యాణ్ ను వాహనం నుంచి దించేశారు. అనంతరం ఇంజిన్ను ఆపేశారు. ఎండ వేడి కారణంగా ఇంజిన్ ఎక్కువగా వేడెక్కడంతోనే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో పోలీసులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో పోలీసులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
పవన్ ప్రచారంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం..!
Share.