ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార గీతాలు, లఘు చిత్రాలతో జోరును పెంచుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ‘రావాలి జగన్-కావాలి జగన్’ పాటతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. తెలుగుదేశం ఎన్నికల ప్రకటనల కార్యక్రమం మొత్తాన్ని దర్శకుడు బోయపాటి తన భుజాల మీద వేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆయన చేసిన అన్ని ప్రకటనలు ఓ స్టాండర్డ్ లో వున్నాయి. దర్శకుడు బోయపాటి తను అనుభవం, తన పొలిటికల్ నాలెడ్జ్ అంతా వాడిన వైనం స్పష్టం అవుతోంది. కాగా, ఈ నేపథ్యంలో టీడీపీ విడుదల చేసిన రెండున్నర నిమిషాల లిరికల్ వీడియో. చంద్రబాబును కీర్తిస్తూ, మోడీ, జగన్, కేసీఆర్ లను దుయ్యబడుతూ ‘శిల మోసే గాయాలే కావా శిల్పాలు’ అనే ప్రచార గీతం అదరగొడుతోంది. ‘నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా.. చంద్రన్నా.. నువ్వు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినా’ అంటూ సాగిన ఈ పాటను ఎవరు రాసారో తెలియదు కానీ, కాస్త చేయి తిరిగిన రచయితే రాసినట్లు కనిపిస్తోంది.
‘నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు..చంద్రన్నా..చంద్రన్నా’
Share.