ప్రభాస్ తో సమంత జోడీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భాషలతో సంబంధం లేకుండా వరుస విజయాలతో సమంత దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో నటనకి ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన పాత్రలను చేస్తూ మరిన్ని మార్కులను కొట్టేస్తోంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలను కూడా కవర్ చేసింది. అలాంటి సమంత త్వరలో ప్రభాస్ సరసన కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఒక వైపున ‘సాహో’ షూటింగులోను .. మరో వైపున ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత నిర్మాత దిల్ రాజు ఈ కాంబినేషన్ ని తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఓ కథ విన్న దిల్ రాజు అందులో ప్రభాస్ హీరోగా, సమంత హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కథని డైరెక్ట్ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: