రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా జగన్ కి వేయి కోట్లు..! -ఉమా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని మోడి పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏపీకీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.. ప్రస్తుతం రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా ఆయన జగన్ కి 1000 కోట్లని పంపించారని ఆయన ఆరోపమలు చేశారు. ఇక కెసిఆర్ తో కలిసిన జగన్ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహి అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ జగన్ లు ఇద్దరు కలిసి ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రలో కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మోదీ అమరవాతి పై పోలవరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సరికావని ఆయన మోదీ పై మండిపడ్డారు. అసలు ఆయన ఒక్కసారైనా ప్రాజెక్టును సందర్శించారా? అని ప్రశ్నించారు. పోలవరం ఓ ఏటీఎం అని ఆయన అనడం బాధ్యతారాహిత్యమని, ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏపీ ప్రజలను అవమానించిన మోదీకి, జులై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు అందించి చూపిస్తామని దేవినేని నెహ్రూ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోలవారం ప్రాజెక్ కై ఇప్పటికీ 4483 కోట్లు కర్చు చేసింది, కేంద్రం నుండి ఆ బకాయిలు రావాల్సిందని ఆయన తెలిపారు. మోదీకి రాష్ట్రాభివృద్ది ఒఐ ఏమాత్రం శ్రద్ధా ఉన్నా నిబద్దత ఉన్నా.. ఆ నిధులని వెంటనే తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇప్పటికే పోలవరం ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో ఇప్పటికే అనేక సార్లు టీ‌ఆర్‌ఎస్ పోలవరం పై కేసులు వేసిందని అటువంటి పార్టీ తో అటువంటి నేత తో జగన్ కలిశారని ఆయన మండిపడ్డాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: