నర్సాపురంలో.. నాగేంద్రబాబు హామీలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన పార్టీ నుండి నర్సాపురం శాసనసభ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న నాగేంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. నాగేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా అంతటా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తమ పార్టీకి ఓటు వేసి తనని గెలిపించమని ప్రజలని కోరుతున్నాడు. ఈ సంధర్భంగా నాగేంద్రబాబు భీమవరం ప్రజలకి తన హామీలు తెలియజేశాడు.

నాగేంద్రబాబు మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నాం.. పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా త్రాగునీరు, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేస్తాం. జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం, 100 అడుగుల అల్లూరి విగ్రహం నిర్మిస్తాం..! భీమవరంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి చేసి, అల్లూరి ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేస్తాం.. అని ఆయన అన్నారు.

తీరంలో ఫిషింగ్ హార్బర్, వశిష్ఠ వారధి నిర్మించి మత్స్యకారులు, తీర ప్రజల కష్టాలు తీరుస్తాం..అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా 15 సీట్లు టీడీపీకి ఇస్తే టీడీపీ ప్రభుత్వం జిల్లాకు ఏమి చేయలేకపోయింది.. టీడీపీ ప్రభుత్వం అసమర్థత, చేతకానితనం వల్లే ప్రజలకు మేలు జరగలేదు. జనసేన అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు 100 శాతం పరిష్కరిస్తాం అంటూ ఆయన సెలవిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: